రూ.5వేల పెట్టుబడితో స్టార్ట్ చేసి 40వేల కోట్లు సంపాదించిన రాకేష్ జున్‌జున్‌వాలా.. ఇది సక్సెస్ స్టోరీ..!

రూ.5వేల పెట్టుబడితో స్టార్ట్ చేసి 40వేల కోట్లు సంపాదించిన రాకేష్ జున్‌జున్‌వాలా.. ఇది సక్సెస్ స్టోరీ..!

Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్‌వాలా స్టాక్ మార్కెట్ ప్రపంచంలో ఈ పేరు వినని వ్యక్తులు ఉండరు. దివంగతులపై ఈ వెటరన్ ఇన్వెస్టర్ ను గతంలో బిగ్ బుల్ అని కూడా పిలిచేవారు. 37 ఏళ్ల సుదీర్ఘ ఇన్వెస్ట్మెంట్ ప్రయాణంలో రాకేష్ దలాల్ స్ట్రీట్ లో మోస్ట్ ఫేమస్. ఆయన ఏ స్టాక్స్ కొన్నారు.. ఏం మాట్లాడుతున్నారు.. ఏం చేస్తున్నారు వంటి విషయాలను చాలా మంది ఇన్వెస్టర్లు పరిశీలిస్తూనే ఉండేవారు. ప్రస్తుతం ఆయన కుటుంబం రాకేష్ లెగసీని కొనసాగిస్తోంది. 

వృత్తి రీత్యా ఇన్వస్టర్ అయిన రాకేష్ ఒక చార్టెడ్ అకౌంటెంట్. ముంబైలో స్థిరపడిన ఈ మార్వాడీ మధ్యతరగతి కుర్రోడు హైదరాబాదులో చదువుకున్నాడు. ఆయన తండ్రి ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న సమయంలో వారు హైదరాబాద్ ప్రాంతంలో కూడా నివసించారు. 1960 జూలై 5 పుట్టిన రాకేష్ తన ఇన్వెస్ట్మెంట్ ప్రయాణాన్ని కేవలం రూ.5వేలతో స్టార్ట్ చేసారు. కానీ ప్రస్తుతం ఆయన సంపద విలువ దాదాపు రూ.40వేల కోట్లుగా అంచనా వేయబడింది. తండ్రి వార్తాపత్రికలు చదవమని అలవాటు చేయటంతో ఆయనకు ప్రపంచ వాణిజ్యం, వ్యాపారాల పనితీరు వంటి అంశాలపై పట్టు వచ్చింది. 

తొలిసారి పెట్టుబడికోసం తన సోదరుడి నుంచి రూ.5వేలు అప్పుగా తీసుకున్న రాకేష్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. అప్పట్లో ఆ డబ్బుతో టాటా టీ షేర్లను ఒక్కోటి రూ.43 రేటుకు కొనుగోలు చేయగా.. వాటి విలువ 3 నెలల్లోనే రూ.143కి చేరుకోవటంతో లక్షల్లో లాభం వచ్చింది. ఆ తర్వాత ఆయన టాటా పవర్, సెసాగోవా ఫర్నిచర్ వంటి పెట్టుబడులతో మంచి లాభం చూశారు. ఇక టాటాలకు చెందిన టైటాన్ స్టాక్ రాకేష్ ఫేవరెట్ అని అందరికీ తెలిసిందే. లాభాలు తగ్గుతున్నప్పటికీ తనిష్క్ వ్యాపారంపై నమ్మకంతో రాకేష్ పెట్టుబడిని కొనసాగించారు. అప్పట్లో షేరును రూ.30-40 మధ్య రేటుకు కొనగా 2025 మార్కెట్ లెక్కల ప్రకారం ఆ స్టాక్ విలువ రూ.15వేల కోట్లకు చేరింది.

►ALSO READ | ఈ 5 అలవాట్లుంటే ఫైనాన్షియల్ గా మీరు ఫిట్‌గా ఉన్నట్లే..!! తెలుసుకోండి..

రాకేష్ ఎప్పుడూ చెబుతుండే మాట మార్కెట్లలో అందరూ అమ్ముతున్నప్పుడు కొనటం స్టార్ట్ చేయాలని. ఎందుకంటే క్వాలిటీ స్టాక్స్ తక్కువ రేటుకు పొందొచ్చని రాకేష్ భావించేవారు. ఆ తర్వాత ఆయన స్థాపించిన రేర్ ఎంటర్ ప్రైజెస్ రాకేష్ కుటుంబానికి సంబంధించిన పెట్టుబడులను చూసుకునేది. మరణానికి కొన్ని నెలల ముందు రాకేష్ ఆకాశ విమానయాన సంస్థను స్టార్ట్ చేశారు. 2021లో స్టార్ట్ అయిన కంపెనీలో ఆయన సహవ్యవస్థాపకులు. 

2022 ఆగస్టులో రాకేష్ గుండెపోటు కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆయన పెట్టుబడులకు సంబంధించిన పూర్తి వ్యవహారాలను రాకేష్ భార్య రేఖా జున్‌జున్‌వాలా చూసుకుంటున్నారు. 2024లో ఈ పెట్టుబడుల విలువ రూ.60వేల కోట్లకు పైగా ఉన్నట్లు వెల్లడైంది. 2023లో పద్మశ్రీతో సత్కరించబడిన రాకేష్ జున్‌జున్‌వాలా తన సంపదలో 25 శాతాన్ని ఛారిటీ కోసం వెచ్చించాలని నిర్ణయించారు. దీంతో ఆ మెుత్తాన్ని విద్య, వైద్య సేవలకు కేటాయిస్తున్నారు.