చైనాలో జనం ఆరోగ్యంపై యుద్ధం..లావుగా ఉన్నోళ్లను కరిగించేందుకు స్పెషల్ జైళ్లు..

చైనాలో జనం ఆరోగ్యంపై యుద్ధం..లావుగా ఉన్నోళ్లను కరిగించేందుకు స్పెషల్ జైళ్లు..

చైనా దేశం ఇప్పుడు జనం ఆరోగ్యంపై యుద్ధం ప్రకటించింది. 2026 ఏడాదిలో జనం ఆరోగ్యం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నది. లావుగా ఉన్నోళ్లను.. బరువు ఎక్కువగా ఉన్నోళ్లను.. ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్లను తీసుకెళ్లి జైల్లో వేయనున్నది అక్కడి ప్రభుత్వం. 28 రోజులు వాళ్లు ఈ జైళ్లలో ఉంటారు. అక్కడ కొవ్వు కరిగిస్తారు.. మంచి ఫుడ్ పెట్టటంతోపాటు.. వ్యాయామం చేయిస్తారు.. వయస్సుకు తగ్గట్టు బరువు ఉండే వరకు ఒళ్లు ఒంచి పని చేయిస్తారు.. చైనా తీసుకొచ్చిన ఆరోగ్యంపై యుద్ధం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

నేటి కాలంలో ఊబకాయం ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. దీనిని వదిలించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమైన వారికి చైనా ఒక కఠినమైన మార్గాన్ని ఎంచుకుంది. అక్కడ ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కలిసి 'వెయిట్ లాస్ ప్రిజన్స్' అదేనండి బరువు తగ్గించే జైళ్లను నడుపుతున్నాయి. ఈ క్యాంపుల్లో చేరడం సులభమే కానీ, వెనక్కి రావడం మాత్రం చాలా కష్టం. మిలిటరీ స్టైల్ ట్రీట్మెంట్ ఒక యుద్ధాన్ని తరపిస్తున్నట్లుగా ఉన్నాయని వెల్లడైంది. 

ఆస్ట్రేలియాకు చెందిన 28 ఏళ్ల యువతి ఒకరు ఈ క్యాంపులో తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సెంటర్లు ఎత్తైన కాంక్రీట్ గోడలు, ఉక్కు గేట్లు, విద్యుత్ తీగలతో హై సెక్యూరిటీ కలిగి ఉంటాయి. సెక్యూరిటీ గార్డుల పహారాలో ఉండే ఈ క్యాంపుల నుంచి 'సరైన కారణం' లేకుండా బయటకు వెళ్లడం అసాధ్యం. లోపలికి వెళ్లేటప్పుడే ఇన్‌స్టంట్ నూడుల్స్, ఫ్రైడ్ స్నాక్స్ వంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను లాక్కుంటారు.

ఈ సెంటర్లలో రోజువారీ దినచర్య తెల్లవారుజామునే మొదలవుతుంది. రోజుకు నాలుగు గంటల పాటు కఠినమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. గ్రూప్ ఏరోబిక్స్, హిట్ క్లాసులు, హై-ఎనర్జీ స్పిన్ క్లాసులతో శరీరాన్ని కరిగిస్తారు. ఆహారం విషయానికొస్తే.. మూడు పూటల మితమైన ఆహారం మాత్రమే ఇస్తారు. ఉదయం తేలికపాటి బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం కూరగాయలు, తక్కువ మాంసంతో కూడిన భోజనం ఉంటుందంట.

దాదాపు 80 వేల రూపాయల ఖర్చుతో కూడిన ఈ 28 రోజుల కోర్సులో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయని ఆస్ట్రేలియన్ యువతి తెలిపింది. ఆమె కేవలం 14 రోజుల్లోనే ఏకంగా 14 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించింది. అక్కడ అందరి లక్ష్యం బరువు తగ్గడమే కాబట్టి.. తోటి వారందరూ ఎంతో స్నేహపూర్వకంగా, సపోర్టింగ్ గా ఉంటున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం చైనాలో పెరిగిపోతున్న ఊబకాయం సమస్యను అరికట్టడానికి ఇలాంటి 'స్పెషల్ సెంటర్లు' ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. ఫ్యాషన్ డైట్లు, జిమ్‌లకు వెళ్లి విసిగిపోయిన వారికి ఇవి బెస్ట్ ఛాయిస్ లా మారుతున్నాయి. కఠినమైన కానీ ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా చైనాలోని ప్రజలు, ప్రభుత్వాలు వీటిని చూస్తున్నాయి.