భూకంపం నుంచి యుద్ధాల వరకు.. AI నుంచి అభివృద్ధి వరకు.. 2026లో బాబా వంగా జోతిష్యం ఏం చెబుతోంది..!

భూకంపం నుంచి యుద్ధాల వరకు.. AI నుంచి అభివృద్ధి వరకు.. 2026లో బాబా వంగా జోతిష్యం ఏం చెబుతోంది..!

2026 సంవత్సరం వచ్చేసింది. మరో 364 రోజులు ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది.. ఈ ప్రపంచంలో ఏం జరగబోతుంది అనేది అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. ప్రతి ఏటా మన భారతీయ జోతిష్యాలతోపాటు.. ప్రపంచ వ్యాప్తంగా బాబా వంగా జోతిష్యం సైతం చర్చనీయాంశం అవుతుంది. 

బల్గేరియా దేశానికి చెందిన ఆధ్యాత్మిక వేత్త అయిన బాబా వంగా.. మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాగే.. ఆమె ఎన్నో విషయాలను ముందుగా చెప్పారని.. అవన్నీ జరిగాయని చెబుతారు. అందుకే బాబా వంగా జోతిష్యం ప్రతి ఏటా ఆసక్తి రేపుతోంది. ఇంతకీ 2026 సంవత్సరంలో.. భూకంపాల నుంచి ప్రపంచ యుద్ధాల వరకు.. AI నుంచి అభివృద్ధి వరకు బాబా వంగా ఏం చెప్పారో ఓ సారి తెలుసుకుందాం..

ప్రకృతి విపత్తులు భారీగా వస్తాయని అంచనా :
2026 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తులు భారీగా వస్తాయి.. భూకంపాలు, శక్తివంతమైన తుఫానులు, అగ్ని పర్వతాలు బద్దలవ్వటం వంటివి చాలా దేశాల్లోజరుగుతాయి. ఈ ప్రకృతి విపత్తులతో భూ మండలంలోని 7 నుంచి 8 శాతం తీవ్రంగా ప్రభావితం అవుతుందని బాబా వంగా జోతిష్యం స్పష్టం చేస్తోంది. 

ఈ దేశాల మధ్య యుద్ధ వాతావరణం :
2026లో ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరిగే అవకాశం ఉందని ఈమె జోతిష్యం అంచనా వేస్తోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు ఉంటాయని అంచనా. తైవాన్ దేశంపై చైనా యుద్ధం చేయొచ్చు. అమెరికా, రష్యా, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతాయి. అమెరికా, రష్యా దేశాల మధ్య టెన్షన్స్ మరింత పెరుగుతాయనేది బాబా వంగా చెబుతున్న ప్రిడిక్షన్.

►ALSO READ | 2026 సంవత్సరం ఒకటితో మొదలవుతుంది.. డబ్బు, ఆరోగ్యం, కెరీర్ పై సంఖ్యా శాస్త్రం ఏం చెబుతోంది..!

AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నియంత్రణ :
2026లో టెక్నాలజీ కొత్త రూపం తీసుకుంటుంది. AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకుపోతుంది. మనుషులను AI నియంత్రించే స్థాయికి వెళుతుంది. మన రోజువారీ జీవితాన్ని ఏఐ ప్రభావితం చేస్తుందని.. ఆటోమెషిన్, యంత్రాలపై అధికంగా ఆధారపడటం జరుగుతుందని బల్గేరియాకు చెందిన ఆధ్యాత్మిక, తత్వ, జోతిష్య శాస్త్రవేత్త బాబా వంగా ఎప్పుడో చెప్పినట్లు చెబుతున్నారు నిపుణులు. 

ఆసియా దేశాల్లో వేగవంతమైన అభివృద్ధి :
ప్రపంచంలో మిగతా దేశాలతో పోల్చితే ఆసియా ఖండంలోని దేశాల్లో 2026లో స్థిరమైన, శక్తివంతమైన అభివృద్ధి ఉంటుందని.. చైనా, ఇండియా, జపాన్ దేశాలు మరింత ముందుకు వెళతాయని బాబా వంగా జోతిష్యం చెబుతోంది.

బాబా వంగా చనిపోయి దశాబ్దాలు అవుతుంది. అయినా ఆమె చెప్పిన అంశాలు, ప్రస్తావించిన అంశాలు ప్రతి ఏటా చర్చకు వస్తూనే ఉన్నాయి. 2026లోనూ ఆమె అంచనాలు ఇవీ అంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేకున్నా.. విస్తృతమైన ప్రచారం ఉంటుంది. 

గమనిక: బాబా వంగా జోతిష్యానికి సంబంధించి ఇవన్నీ అంచనాలు మాత్రమే. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇంటర్నెట్ నివేదికలు, సోషల్ మీడియాలో ప్రచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వటం జరుగుతుంది. ఈ కథనంపై V6 News ఎలాంటి బాధ్యత వహించదు.