2026 సంవత్సరం ఒకటితో మొదలవుతుంది.. డబ్బు, ఆరోగ్యం, కెరీర్ పై సంఖ్యా శాస్త్రం ఏం చెబుతోంది..!

2026 సంవత్సరం ఒకటితో మొదలవుతుంది.. డబ్బు, ఆరోగ్యం, కెరీర్ పై సంఖ్యా శాస్త్రం ఏం చెబుతోంది..!

2026 సంవత్సరం  జనవరి 1 వ తేది సరికొత్త ఆశలతో మన ముందుకు వచ్చింది. కొత్త ఆరంభాలు ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తాయి, కానీ వాటిని అందిపుచ్చుకోవాలంటే మనలో అంతర్గత బలం (Inner Strength) ఉండాలి. సంఖ్యాశాస్త్రం ప్రకారం, బలహీనతలను అధిగమించి, శక్తిని ఎలా పెంచుకోవాలో దిశానిర్దేశం చేస్తుంది.

2026  జనవరి నుంచి కుజుడు బలం ఎక్కువుగా ఉంటుంది. ఈ గ్రహం అనుకూలం తక్కువుగా ఉన్నవారు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. నిజాయితీతో తమ వ్యక్తిగత అంచనాలను అందుకుంటారు.  ఫిబ్రవరి ,  మార్చిలో  గ్రహణాల   ప్రభావం ఉంటుంది. గురుడు అనుకూలంగా ఉన్నవారికి  కెరీర్, ఇమేజ్  వ్యక్తిగత శక్తిలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.  కొత్త సంవత్సరంలో గురు గ్రహం అనుకూలంగా ఉన్న వారు అతి త్వరగా ప్రతిఫలం అందుకుంటారు. 

ప్రేమ సంబంధ విషయాల్లో ఈ ఏడాది(2026) భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం సంఖ్యలు కేవలం వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, మన గతాన్ని, వర్తమానాన్ని మరియు భవిష్యత్తు అవకాశాలను కూడా ప్రతిబింబిస్తాయి. 1 నుండి 9 వరకు ఉన్న ప్రతి మూల సంఖ్యకు ఒక ప్రత్యేక తరంగం మరియు ప్రభావం ఉంటుంది. సూర్యుడు ఏలికగా ఉన్నందున, 2026 ఆశయాలను నెరవేర్చుకునే సంవత్సరంగా ఉండబోతోంది. కెరీర్ వృద్ధి, ఆర్థిక లాభాలు మరియు వ్యక్తిగత పురోగతికి ఇది అనువైన సమయం. ఈ ఏడాది  ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సంఖ్యాశాస్త్ర పండితులు చెబుతున్నారు.  

కెరీర్​ విషయంలో..

సంఖ్యాశాస్త్రం ప్రకారం 2026లో  మీ కెరీర్ ఆశయాలు నెరవేరుతాయి.  జనవరి ,  ఫిబ్రవరి నెలల్లో కుజుడు దృష్టి వలన  పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. 2026 వ సంవత్సరం మొదటిమూడు నెలల్లో అంటే మార్చి చివరి వరకు  వచ్చే గ్రహణాలు  వృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్ర పండితులు చెబుతున్నారు. నాయకత్వం వహించే వారికి అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. 

ఆర్థిక పరంగా..

ఇక రెండో త్రైమాసికంలో గురుడు స్థానాన్ని మార్చుకుంటాడు.  ఈ సమయంలో నైపుణ్యాలకు కొత్త ఆఫర్లు.. కొత్త ప్రాజెక్ట్​లు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితమైన వ్యూహాత్మకంగా ప్రణాళికను అదుపు చేస్తారు.  సంవత్సరం రెండవ భాగంలో బృహస్పతి తన స్థానాన్ని మార్చుకున్నప్పుడు మీ నిజమైన నైపుణ్యాలకు .  గురుడు శుభ దృష్టి వలన ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.  మీ కమ్యూనికేషన్ స్కిల్స్​ డెవలప్​ అవుతుంది. ఫ్రీలాన్సర్ గా పని చేపేవారు స్మార్ట్​ నెట్​ వర్కింగ్​ ప్రయత్నాలు పెంచుకుంటారు. ఆర్థిక విషయాలకు వస్తే కుజుడు వలన  అప్పులు.. సాధారణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. 

జూన్ నెల ప్రారంభం తరువాత  గురుడి అనుకూల దృష్టి వలన ఇబ్బందులు తొలగి ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి.  2026 చివరి నాటికి, మీ ఆర్థిక పరిస్థితి విషయంలో వ్యవస్థీకృతంగా ఉంటాయి.

ఆరోగ్య విషయంలో..

ఈ ఏడాది ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫిబ్రవరి ,  మార్చి గ్రహణాల సమయంలో కొద్దిపాటా అలసటకు గురవుతారు.  రోజువారీ నడక, మంచి నిద్ర , డైట్​ వ్యవహారాలకు చాలా ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారని సంఖ్యాశాస్త్ర పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.