మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు : 3AC టికెట్ రూ.2 వేల 300

మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు : 3AC టికెట్ రూ.2 వేల 300

దేశంలో  మొట్టమొదటి  వందే భారత్ స్లీపర్ రైలు  పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.  ఈ స్లీపర్  వందే భారత్ రైలు  గౌహతి , హౌరా(కోల్ కతా) మధ్య   నడవనుంది. త్వరలోనే   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైలు 2026 జనవరి 17 లేదా 18న ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.  

దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు  ఫోటోలను  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్  తన ఎక్స్ లో పోస్ట్ చే శారు.   వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణించే ప్రయాణీకులకు సౌకర్యవంతమైన బెడ్స్  ఉన్నాయి.  దీని వలన సుదూర ప్రయాణాల సమయంలో వందే భారత్‌లో పడుకోవచ్చు. దేశంలో నడుస్తున్న మునుపటి వందే భారత్ రైళ్లలో కుర్చీ సీట్లు ఉండేవి, కాబట్టి ప్రజలు కూర్చొని మాత్రమే ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు భారతీయ రైల్వేలు కొత్త వందే భారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లను కూడా ప్రవేశపెడుతోంది. రానున్న రోజుల్లో ఇలాంటి రైళ్లను మరిన్ని ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు రైల్వే మంత్రి. రాబోయే ఆరు నెలల్లో 8 వందే భారత్ స్లీపర్ రైళ్లు, ఏడాది చివరి నాటికి  12  స్లీపర్ రైళ్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 

రైలు ఛార్జీ ఎంత?

భారత రైల్వే వందే భారత్ స్లీపర్ రైలు  ఛార్జీలను విడుదల చేసింది. గౌహతి నుంచి హౌరా( కోల్ కతా) వరకు  ఈ రైలులో 3AC కి భోజనంతో సహా  రూ.2,300. 2AC  ప్రయాణీకులకు రూ. 3,000 ,AC ప్రయాణీకులకు రూ.3,600 ఛార్జీలుగా  ఉంది.