కొత్త ఏడాదిలో చందమామ అద్బుతం రాబోతున్నది. ఎప్పుడో కాదు.. జనవరి 3వ తేదీ.. శనివారం రాత్రి. ఆ రోజు పౌర్ణమి కూడా.. 2026లో వస్తున్న ఫస్ట్ పౌర్ణమి.. ఆ రోజునే సూపర్ మూన్ ఏర్పడుతుంది.
జనవరి 3వ తేదీ సూర్యాస్తమయం సమయం సాయంత్రం 5 గంటల 33 నిమిషాలు. సూర్యాస్తమయం అయిన 20 నిమిషాల తర్వాత.. అంటే 6 గంటల సమయానికే చంద్రుడు స్పష్టంగా కనిపించనున్నట్లు చెబుతున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. జనవరి 3వ తేదీ శనివారం ఏర్పడనున్న సూపర్ మూన్.. అద్భుతంగా అంటున్నారు శాస్త్రవేత్తలు.
రోజు కనిపించే చంద్రుడు కంటే.. ఆ రోజు 15 శాతం పెద్దగా.. 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. అంతే కాదు మరింత చల్లగా.. భూమికి 3 లక్షల 56 వేల 500 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాడని చెబుతున్నారు.
Also Read : మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు
ఆకాశంలో చంద్రుడి అద్భుతాన్ని చూడటానికి ఎలాంటి టెలిస్కోపులు, ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. జస్ట్ ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. తల పైకి ఎత్తి.. ఆకాశంలో చూస్తే చాలు.. చందమామ పెద్దగా.. ప్రకాశవంతంగా కనిపిస్తాడు.
చలికాలంలో వచ్చే సూపర్ మూన్ ను తోడేళ్ల చంద్రుడు అని కూడా అంటారు. భూమికి చంద్రుడు దగ్గరకు వచ్చినప్పుడు సముద్రంలో అలల ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో అడవిలో జంతువులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. తోడేళ్లు వింతగా ప్రవర్తిస్తాయని.. వాటి అరుపులు, పరుగులు ఎక్కువగా ఉంటాయని.. అందకే పూర్వకాలంలో దీన్ని తోడేళ్ల చంద్రుడు అని పిలిచేవాళ్లు.
ఇప్పుడు సైన్స్ పెరిగింది.. జ్ణానం, విజ్ణానం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సూపర్ మూన్ అంటున్నాం. ఎవరు ఎన్ని అనుకున్నా.. ఈ వీకెండ్ వచ్చే ఈ సూపర్ మూన్ ను చూసి ఎంజాయ్ చేద్దాం.. ఆస్వాదిద్దాం..
