ఈ 5 అలవాట్లుంటే ఫైనాన్షియల్ గా మీరు ఫిట్‌గా ఉన్నట్లే..!! తెలుసుకోండి..

ఈ 5 అలవాట్లుంటే ఫైనాన్షియల్ గా మీరు ఫిట్‌గా ఉన్నట్లే..!! తెలుసుకోండి..

నేటి కాలం యువతలో ఎక్కువ మంది సరైన ఆర్థిక ప్రణాళికలు లేకుండా లోన్స్, ఈఎంఐల ఊబిలో చిక్కుకుపోతున్నారు. లగ్జరీగా జీవించాలని చేస్తున్న కొన్ని ఆర్థిక తప్పులు ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణ కాలంలో అప్పుల భారాన్ని పెంచేస్తోందని ఫైనాన్షియల్ నిపుణులు అక్షత్ శ్రీవాస్తవ్ చెప్పారు. అయితే 2025లో ఐదు అలవాట్లు కలిగిన వ్యక్తి ఆర్థికంగా డబ్బును సమర్థవంతంగా మేనేజ్ చేస్తున్నాడని గుర్తించటానికి గుర్తుగా ఆయన వెల్లడించారు.

* ముందుగా అక్షత్ సేవింగ్స్ హ్యాబిట్ గురించి మాట్లాడారు. సంపాదిస్తున్న మెుత్తంలో 20 శాతం ప్రతి నెల క్రమశిక్షణతో దాచుకోవటం ముఖ్యమన్నారు. సంపన్నుల్లో కూడా దాదాపు సగం మంది మాత్రమే సేవింగ్స్ విషయంలో ముందుకెళ్లగలుగుతున్నట్లు చెప్పారు. 

* ప్రస్తుతం అందుబాటు రేట్లలో ఇళ్లు తగ్గిపోవటంతో చాలా మంది నేటి కాలం యువత సొంత ఇంటి కలకు దూరంగా ఉంటున్నారని శ్రీవాస్తవ్ అన్నారు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించటానికి సొంత ఇల్లు కలిగి ఉండటం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. ఇది భవిష్యత్తులో పెరిగే లివింగ్ ఖర్చులు ప్రధానంగా హెల్త్, ఫుడ్ వంటి వాటి నుంచి కొంద ఊరటను కలిగిస్తుందని చెప్పారు. అందుకే ఖచ్చితంగా సొంతిల్లు కలిగి ఉండాలన్నారు. 

ALSO READ : GST పై మోడీ ప్రకటన

* ఇక అప్పులు చేయకుండా నేటి కాలంలో జీవించటం కష్టమే. కానీ అవి పరిమితికి మించకుండా ఉండేలా చూసుకోవటం ముఖ్యమని ఈఎంఐల భారం తగ్గించుకోవాలని శ్రీవాస్తవ్ చెప్పారు. మెుత్తం సంపాదనలో ఈఎంఐలు 30 శాతం మాత్రమే ఉండాలని అప్పుడే ఆర్థికంగా బలంగా ఉన్నట్లు సూచించారు. 

* ఇక ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కలిగి ఉండాల్సింది ఎమర్జెన్సీ సేవింగ్స్. ప్రస్తుతం మీకు నెలకు అయ్యే ఖర్చులకు అనుగుణంగా కనీసం రెండేళ్ల పాటు జీవించటానికి సరిపడా డబ్బును కలిగి ఉండాలని శ్రీవాస్తవ్ చెప్పారు. అనుకోకుండా ఉద్యోగం పోయినా లేదా కొత్త కెరీర్ వైపు మారాలనుకున్నా అలాంటి సమయాల్లో ఇది ఆర్థికంగా కుంటుంబాన్ని ముందుకు నడిపించటానికి సహాయపడుతుందని శ్రీవాస్తవ్ చెప్పారు. 

* ఇక ఎంత సంపాదించినా కావాల్సింది దానిని ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎన్నాళ్లు పెట్టుబడి పెట్టాలి వంటి జ్ఞానం కలిగి ఉండటం అంటారు శ్రీవాస్తవ్. కొన్నిసార్లు ప్రజలు సరైన అవగాహన లేకుండా చేసే పనులు వారిని పేదవారిగా మార్చేస్తుంటాయని హెచ్చరించారు. ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు దానిని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే ఆ సంపద హరించుకుపోయే ప్రమాదం ఉందని అన్నారు. 

పైన పేర్కొన్న పేరామీటర్స్ ఎవరైతే పాటిస్తున్నారో వారు ప్రస్తుతం ఆర్థికంగా  బలంగా ఉండటంతో పాటు వీటిని కొనసాగిస్తే భవిష్యత్తులో కూడా ఆర్థికంగా ఫిట్ గా కొనసాగుతారని ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీవాస్తవ్ వెల్లడించారు.