ఎయిర్ గన్ తో బెదిరింపు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఎయిర్ గన్ తో బెదిరింపు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మెహిదీపట్నం, వెలుగు: టోలిచౌకిలో ఓ వ్యక్తి ఎయిర్ గన్ తో బెదిరింపులకు దిగాడు. టోలిచౌకి పరిధిలోని రాహుల్ కాలనీకి చెందిన అమ్రాన్ శుక్రవారం సాయంత్రం ఇల్లు వెకేట్​ చేస్తున్నాడు. ఈ క్రమంలో లేబర్ లను లిఫ్ట్ ఎక్కవద్దన్నాడు. వారు వినకుండా లిఫ్ట్ ఎక్కడంతో కోపోద్రిక్తుడై తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తీసి బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అమ్రాన్ తో పాటు ఎయిర్ గన్ ను అదుపులోకి తీసుకుని  విచారిస్తున్నారు.