
ఆమెరికాలో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది . అమెరికాలోని లెవిస్టన్ నగరంలో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో 22 మంది మృతి చెందగా, 60 మందికి గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ ఘటనతో అక్కడి ప్రభుత్వం హై అలెర్ట్ అయింది. కాల్పుుల జరిపిన వ్యక్తి అత్యంత ప్రమాదకారి అని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ పోలీస్ కార్యాలయం వారి ఫేస్ బుక్ పేజీలో అనుమానితుడి రెండు ఫొటోలను విడుదల చేశారు.
అతని ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని ప్రజలను కోరారు. పోలీసులు షేర్ చేసిన ఫోటోలో పొడవాటి స్లీవ్ షర్ట్, జీన్స్ ధరించి, గడ్డం కలిగిన వ్యక్తి ఫైరింగ్ రైఫిల్ పట్టుకుని కనిపిస్తున్నాడు.