క్రిప్టో చుట్టూ మోసగాళ్ల వల

క్రిప్టో చుట్టూ మోసగాళ్ల వల
  • క్రిప్టో చుట్టూ మోసగాళ్ల వల
  • ఫేక్ వీడియోలతో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న స్కామర్లు
  •  ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను డబుల్ చేస్తామంటూ గాలం
  •  పెరుగుతున్న పొంజీ స్కీమ్‌‌‌‌‌‌‌‌లు

బిజినెస్‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు:  దేశంలో  క్రిప్టో కరెన్సీలు ఎంత పాపులరో తెలిసిందే. ప్రస్తుతం 9 కోట్ల మంది క్రిప్టో ఇన్వెస్టర్లు ఉన్నారని అంచనా. క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్​తో కూడుకున్నది. కేవలం వోలటాలిటీ ఎక్కువగా ఉంటుందనే కాదు, హ్యాకర్లు, స్కామర్ల (స్కామ్స్ చేసే వాళ్ల) కు క్రిప్టో ఇన్వెస్టర్లు టార్గెట్‌‌‌‌గా మారుతుండడమే ఇందుకు కారణం. సోషల్‌‌‌‌ మీడియాలో లేదా డేటింగ్‌‌‌‌ యాప్‌‌‌‌లలో పరిచయమై క్రిప్టో ఇన్వెస్టర్లను మోసగాళ్లు దోచుకుంటున్నారు. గ్యారెంటీ రిటర్న్‌‌‌‌లని చెప్పి ఆశ చూపుతున్నారు. చాలా మంది ఇన్వెస్టర్లు పాపులర్‌‌‌‌‌‌‌‌ టీవీ షో పేరుతో ఉన్నాయనే క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తున్నారు. గ్లోబల్‌గా క్రిప్టో ఇన్వెస్టర్లను మోసం చేసి 2021 లో 14 బిలియన్ డాలర్లను స్కామర్లు  దోచుకున్నారని బ్లాక్‌‌‌‌చెయిన్ డేటా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ చైనాలసిస్‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది.

క్రిప్టో మోసగాళ్ల మాటలు నమ్మి చాలా మంది ఇన్వెస్టర్లు స్కామర్ల అకౌంట్‌‌‌‌లకు క్రిప్టోలను పంపడం, గ్యారెంటీ రిటర్న్‌‌‌‌ల కోసం డబ్బులను పంపడం, సోషల్ మీడియా టిప్స్‌‌‌‌ను ఫాలో అయ్యి  ఊరు పేరులేని క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయడం వంటివి చేసి భారీగా నష్టపోతున్నారు. తాజాగా పోంజీ స్కీమ్‌‌‌‌లు కూడా హల్‌‌‌‌చల్ చేస్తున్నాయి. ‘ రూ. నాలుగు లక్షలు ఇన్వెస్ట్‌‌‌‌ చేయండి.  మరో ఇద్దరిని జాయిన్ చేస్తే  నెలకు రూ.లక్ష ఆదాయం అందుకోండి’ అంటూ కొన్ని క్రిప్టో పొంజీ స్కీమ్‌‌‌‌లు మార్కెట్‌‌‌‌లో హల్‌‌‌‌చల్ చేస్తున్నాయి. చాలా మంది ఇన్వెస్టర్లు బిట్‌‌‌‌కాయిన్ మైనింగ్ అంటూ కొన్ని యాప్‌‌‌‌లలో డబ్బులు పెడుతున్నారు. వీరు పెట్టిన డబ్బులకు భారీ లాభాలను ఇస్తామంటూ స్కామర్లు  వల వేస్తున్నారు.  కేవలం ఇవే కావు  కొనుగోలు చేసిన క్రిప్టోలను దాచుకోవడం కూడా ఇన్వెస్టర్లకు కష్టంగా మారింది.  క్రిప్టోలను దాచుకునే డిజిటల్ వాలెట్లను ఆన్‌‌‌‌లైన్ మోసగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. చాలా క్రిప్టో కరెన్సీలు కొన్ని రోజులకే దుకాణం సర్దేస్తున్నాయి. వీటి వాల్యూ జీరోకి పడిపోతోంది. తాజాగా టెర్రా లూనా వాల్యూ ఒకే రోజులో జీరోకి పడిపోయిన విషయం తెలిసిందే. లక్షల మంది ఇన్వెస్టర్లు ఈ క్రిప్టోలో చిక్కుకుపోయారు. 


ఫేక్‌‌‌‌ ఎలన్‌‌‌‌ మస్క్‌‌‌‌ వీడియోలతో మోసం..


క్రిప్టో ఇన్వెస్టర్లను మోసం చేయడానికి ఫేక్ ఎలన్ మస్క్ యూట్యూబ్‌‌‌‌ వీడియోలను స్కామర్లు వాడుతున్నారు. యూట్యూబ్ అకౌంట్లను హ్యాక్ చేసి ఇలాంటి ఫేక్ వీడియోలను లైవ్‌‌‌‌ స్ట్రీమ్ చేస్తున్నారు. మస్క్ క్రిప్టో కరెన్సీలకు సంబంధించి గైడ్‌లైన్స్ ఇవ్వడం, సలహాలు ఇవ్వడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. ఈ వీడియోల ద్వారా తమకు బిట్‌‌‌‌కాయిన్లు, ఎథీరియమ్‌‌‌‌లను పంపేలా ఇన్వెస్టర్లను స్కామర్లు మభ్యపెడుతున్నారు. ఇటువంటి ఫేక్ లైవ్‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌ల వలన  ఈ నెలలో ఒకే వారంలో 2,43,000 డాలర్లను ఇన్వెస్టర్ల నుంచి స్కామర్లు దోచుకున్నారని బీబీసీ రిపోర్ట్ పేర్కొంది. ఓ ఫారిన్ మ్యూజిక్ ఆర్టిస్ట్ తన యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌లో మస్క్ ఫేక్ వీడియోలు దర్శనమిచ్చాయని చెప్పారు.


క్రిప్టో మోసాల నుంచి తప్పించుకోండి ఇలా..


1) ఫేక్ వెబ్‌‌‌‌‌‌సైట్లకు దూరంగా ఉండాలంటే వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ల యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ బార్‌‌‌‌‌‌‌‌లో చిన్న సైజులో లాక్‌‌‌‌ సింబల్‌‌‌‌ ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే అలాంటి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఎటు వంటి డేటా ఎంటర్ చేయొద్దు. వెబ్‌‌‌‌సైట్ అడ్రస్ దగ్గర ‘హెచ్‌‌‌‌టీటీపీఎస్‌‌‌‌’ లేకపోయినా జాగ్రత్త పడాలి.
2) ఫేక్ యాప్‌‌‌‌లు పెరుగుతున్నాయి. డౌన్‌‌‌‌ లోడ్ చేసుకునే ముందు యాప్‌‌‌‌ల స్పెల్లింగ్‌‌‌‌ను జాగ్రత్తగా చూసుకోవాలి. లోగోలో లేదా యాప్‌‌‌‌ కలరింగ్‌‌‌‌లో తేడా అనిపించినా అటువంటి యాప్స్‌‌‌‌కు దూరంగా ఉండాలి.
3) క్రిప్టో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను ఎవరైనా డబుల్ చేస్తామని చెబితే నమ్మొద్దు. వారిచ్చే టిప్‌‌‌‌లను ఫాలో కావొద్దు. ఎక్స్‌‌‌‌పర్టుల తో డబుల్ చెక్ చేసుకోవాలి.
4)  ఈ–మెయిల్ అడ్రస్‌‌‌‌లలోని లింక్‌‌‌‌లను క్లిక్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. సెండర్‌‌‌‌‌‌‌‌ మెయిల్ అడ్రస్‌‌‌‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.