‘కాకా’ స్మారకార్థం.. అంబేద్కర్ జీవిత చరిత్రపై నాటక ప్రదర్శన

‘కాకా’ స్మారకార్థం.. అంబేద్కర్ జీవిత చరిత్రపై నాటక ప్రదర్శన

గోదావరిఖని, వెలుగు: మహనీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి స్మారకార్థం ఆదివారం రాత్రి గోదావరిఖని మెయిన్​ చౌరస్తాలో అంబేద్కర్​ జీవిత చరిత్ర, ఆయన ఆశయాలపై ‘సంఘం శరణం గచ్ఛామి’ నాటకాన్ని ప్రదర్శించారు. ముందుగా అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, బాబూ జగ్జీవన్​రామ్, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఫొటోలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

రాష్ట్ర మంత్రి జి.వివేక్​ వెంకటస్వామి, ఎమ్మెల్యే వినోద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సౌజన్యంతో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్​ అకాడమీ ప్రదర్శించిన ఈ నాటకాన్ని  తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో  తరలివచ్చారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సామాజిక సమతా వేదిక ప్రతినిధులు గుమ్మడి కుమారస్వామి, కె.స్వామి, పులి మోహన్, పెంట రాజేశ్, కోటగిరి పాపయ్య, నూనె కొమురయ్య, పర్లపల్లి రవి, జేవీ రాజు, దుబాసి మల్లేశ్, రాచకొండ కోటేశ్వర్లు, నర్సింగ్​ దొర, చింతకింది సంపత్, కాసిపేట శివాజీ, కల్వల సంజీవ్, వడ్డేపల్లి శంకర్, యాదగిరి సత్తయ్య, సుల్వ లక్ష్మీనర్సయ్య, ఎన్.మారుతి, జనగామ కవితా సరోజిని, కుమార్, తోకల రమేశ్  పాల్గొన్నారు.