కొవిన్ యాప్ యూజర్ ​నేమ్, పాస్​వర్డ్ అమ్ముతానంటూ టెలిగ్రామ్​లో పోస్ట్

కొవిన్ యాప్ యూజర్ ​నేమ్, పాస్​వర్డ్ అమ్ముతానంటూ టెలిగ్రామ్​లో పోస్ట్

న్యూఢిల్లీ: దేశంలోని హెల్త్​ సెక్టార్​కు సంబంధించిన సర్వర్లపై సైబర్​దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్​పై ఒకే రోజు 6 వేల సైబర్ ఎటాక్స్​ చేయగా.. ఇప్పుడు కొవిన్ ప్లాట్​ఫాంపై దాడులు చేశారు. ఓ ఇరానియన్​ హ్యాకర్​ కొవిన్​ ప్లాట్​ఫామ్​కు సంబంధించి అడ్మిన్​ యాక్సెస్​ సాధించానని, పాస్​వర్డ్​, యూజర్​నేమ్​ కావలసిన వారు తనను టెలిగ్రాంలో సంప్రదించవచ్చని డార్క్​ వెబ్​లో ఒక పోస్ట్​ పెట్టాడు. కొవిన్​ ప్లాట్​ఫాంలో ఉన్న హెల్త్​ కేర్​ వర్కర్లకు సంబంధించిన డేటాను కూడా అమ్మకానికి ఉంచాడు.

కొవిన్​ ప్లాట్​ఫాంకు సంబంధించిన స్క్రీన్​షాట్లను కూడా అతడు షేర్​  చేశాడు. కరోనా వ్యాక్సినేషన్​కు సంబంధించిన సమాచారం, వ్యాక్సినేషన్​ సెంటర్ల వివరాలు, హెల్త్​ వర్కర్లు, వ్యాక్సిన్​ వేయించుకున్న వారి మొబైల్​ నంబర్లు, ఇతర వివరాల వంటి సెన్సిటివ్​ సమాచారం కొవిన్​ పోర్టల్​లో ఉంటుంది. కొవిన్​ ప్లాట్​ఫాం అడ్మిన్​ పేజీ కంట్రోల్స్ తన దగ్గర ఉన్నాయని హ్యాకర్​ వెల్లడించాడు. హ్యాకర్​ను ఇరాన్​కు చెందిన నజిలా బ్లాక్​హ్యాట్​గా గుర్తించారు. ఇతడు ఇరాన్​ సెక్యూరిటీ టీమ్​ ఏపీటీ గ్రూప్ కు చెందిన మెంబర్​ అని తెలిసింది. వివిధ దేశాల ప్రభుత్వ విభాగాలకు చెందిన సర్వర్లే లక్ష్యంగా ఈ టీమ్​ సైబర్ దాడులు చేస్తుంది. వరుస సైబర్​ దాడుల నేపథ్యంలో ప్రభుత్వ సర్వర్లను కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సైబర్​ సెక్యూరిటీ ఎక్స్​పర్ట్ అమిత్​ దూబే సూచించారు.