
శ్రీకాళహస్తి ఆలయంలో పని చేసే అర్చకుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. రేపటి నుంచి శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర స్వామి దర్శనం కల్పించేందుకు ట్రయల్ రన్ నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దీంతో ఆలయంలో పని చేసే ఉద్యోగులు, అర్చకులకు ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయించారు. మొత్తం 71 మంది శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపగా.. ఆలయంలో పనిచేసే ఒక అర్చకుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన ట్రయల్ రన్ వాయిదా వేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి పరిస్థితులు అనుకూలిస్తే ట్రయల్ రన్ తర్వాత 12వ తేదీ నుంచి సామాన్య భక్తుల దర్శనాలు, రాహు కేతు పూజలకు అనుమతి ఇవ్వాలని భావించారు.