
ఏటూరునాగారం, వెలుగు: వర్షాలు, వరదల కారణంగా రోడ్డుపై వరద నీరు చేరడంతో దవాఖానాకు పోవడానికి మార్గం లేక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రిటైర్డ్ఉద్యోగి చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామానికి చెందిన తిప్పనబోయిన రామయ్య (60) చిన్నబోయినపల్లిలోని గిరిజన ఆశ్రమ స్కూల్లో వర్కర్‌గా పనిచేసి రిటైర్‌అయ్యారు. ఆయన అస్తమా పేషెంట్కావడంతో ఆదివారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు ఏటూరునాగారంలోని దవాఖానాకు తీసుకుపోవాలని అనుకున్నా కొండాయి, మల్యాల గ్రామాల మధ్య మెయిన్‌రోడ్డును మల్యాల వాగు వరద నీరు ముంచెత్తడంతో వెళ్లలేకపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి వద్దే ఉంచగా మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు.