హైదరాబాద్ జగద్గిరిగుట్టలో.. పట్టపగలు అందరు చూస్తుండగానే..యువకుడిపై కత్తిపోట్లు

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో.. పట్టపగలు అందరు చూస్తుండగానే..యువకుడిపై కత్తిపోట్లు

హైదరాబాద్ సిటీలో పట్టపగలే కత్తిపోట్లు కలకలం రేపాయి. నడిరోడ్డుపై  పట్టపగలు అందరు తిరుగుతుండగానే.. చౌరస్తాలో  ఓ యువకుడిని పట్టుకుని  దారుణంగా పలుమార్లు కత్తితో  పొడిచాడు ఓ రౌడీషీటర్ . వద్దువద్దూ అని బతిమిలాడుతున్నా వినకుండా కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. కత్తిపోట్ల దాటికి  ఆ  యువకుడికి ఒళ్లంతా రక్తం కారుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జగద్గిరిగుట్ట బస్ స్టాండ్  దగ్గర రోషన్ అనే యువకుడిపై బాలేశ్వర్ రెడ్డి అనే రౌడీ షీటర్.. మరో దుండగుడు కత్తితో దాడి చేశారు. రౌడీ షీటర్ నుంచి తప్పించుకుని పారిపోయాడు ఆ యువకుడు. అనంతరం రౌడీ షీటర్ అతని వెంట వచ్చిన మరో  ఇద్దరు దుండగులతో కలిసి బైక్ పై అక్కడి నుంచి వెళ్ళిపోయారు.  

తీవ్ర గాయాల పాలైన రోషన్  ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి  పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఆర్థిక లావాదేవీల విషయంలో  హత్య యత్నానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.