ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్దంతో హైదరాబాద్ నగర వాసుల్లో భయాందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కు చెందిన 900 మంది విద్యార్థులు ఇరాన్ లోని టెహ్రాన్, కుం నగరాల్లో చదువుకుంటున్నారు. శనివారం ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా నగరంలోని పాతబస్తీ , టోలీచౌకి ప్రాంతాల్లోని ఆయా విద్యార్థులను పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. మరోవైపు తెలంగాణకు చెందిన 2వేల మంది ఇరాన్ లో ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ నుంచి విద్యార్థులు, ఇంజనీర్లతోపాటు వ్యాపారులు తరుచుగా ఇరాన్ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇరాన్ లోని హైదరాబాదీల సమాచారం తెలియకపోవడంతో సంబంధీకులు ఆందోలన చెందుతున్నారు. ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో తమ పిల్లల ఫోన్లు కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
