పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారత షట్లర్ పీవీ సింధు, త్రుటిలో వైమానిక దాడి నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించారు. తాజాగా అక్కడి పరిస్థితులపై ఆమె ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ‘మేము విమానాశ్రయంలో ఆశ్రయం పొందిన ప్రదేశానికి అతి సమీపంలోనే భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన ప్రదేశానికి నా కోచ్ అతి దగ్గరగా ఉండటంతో, ఆయన అక్కడి నుంచి పరుగులు తీయాల్సి వచ్చింది.
‘ఇక్కడి పరిస్థితులు గంట గంటకూ భయానకంగా మారుతున్నాయి. భారీ పేలుడుతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. నా కోచ్‌తో సహా అందరం భయంతో అక్కడినుంచి పరుగులు తీశాం. ప్రస్తుతం మేమంతా క్షేమంగానే ఉన్నం. ఎయిర్‌పోర్టులోని సిబ్బంది, అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు’ అంటూ సింధు పోస్ట్చేసింది
The ordeal continues to unfold, and the situation is becoming more frightening by the hour.
— Pvsindhu (@Pvsindhu1) March 1, 2026
A few hours ago, there was an explosion close to where we were holed up at the airport. My coach had to quickly run out of the area as he was closest to the smoke and debris. It was an… https://t.co/ZdNtuALk0P
