ఇకనైనా సైలెంట్‎గా ఉండండి.. కాదు కూడదు అంటే..: ఇరాన్‎కు ట్రంప్ మరో హెచ్చరిక

ఇకనైనా సైలెంట్‎గా ఉండండి.. కాదు కూడదు అంటే..: ఇరాన్‎కు ట్రంప్ మరో హెచ్చరిక

వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్య తర్వాత పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమైంది. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. మిడిల్ ఈస్ట్‎లో యూఎస్ మిత్రదేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, బాంబులతో అటాక్స్ చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‎ను మరోసారి హెచ్చరించాడు. 

ప్రతీకార దాడులకు దిగకపోవడమే ఇరాన్‎కు మంచిదని సూచించారు. ఇరాన్ ప్రతిదాడులు చేస్తే మరింత తీవ్రంగా బదులిస్తామని.. ఈసారి ఎవరూ ఊహించని రీతిలో దాడులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ట్రంప్‎ వార్నింగ్‎కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. సుప్రీం లీడర్ ఖమేనీ బాటలోనే నడుస్తామని స్పష్టం చేసింది.

 ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చిచెప్పింది. అమెరికా, ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఈ తప్పు ఎందుకు చేశామా అని చింతించేలా దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఖమేనీ మరణం తర్వాత కూడా ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో మధ్యప్రాచ్యంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.