
బీఆర్ఎస్ పార్టీకి జిల్లాల్లో గట్టి షాక్ తగులుతుంది. రోజుకో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి. ఈ బాటలోనే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపలిటీ నడిచింది. మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మొత్తం15 మంది కౌన్సిలర్లకు గాను, చైర్ పర్సన్ ముత్యం సునీత పై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 12 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. అందులో 5 మంది కాంగ్రెస్, 7 గురు బిఆర్ఎస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. 15 మంది కౌన్సిలర్లకు గాను 5 గురు కాంగ్రెస్, 9 మంది బిఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఉన్నారు.