గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రాత్రికి రాత్రే రూ. 5 కోట్లతో జంప్.!

గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రాత్రికి రాత్రే రూ. 5 కోట్లతో జంప్.!

హైదరాబాద్ లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాలిస్తామని చెప్పి అమాయకులైన నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని లక్షలు దండుకుంది.రాత్రికి రాత్రే కంపెనీ ఎత్తేసి పారిపోయారు. 

 గచ్చిబౌలిలో ప్యూరోపాల్  క్రియేషన్ & ఐటీ సోలుషన్స్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాలిస్తామని దాదాపు 200 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 3  లక్షల వరకు వసూలు చేసింది కంపెనీ.  ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది యాజమాన్యం. 

 కోచింగ్ ముగిసినా  ఉద్యోగాలు రాకపోవడంతో నిలదీశారు . దీంతో గచ్చిబౌలిలో ఆఫీసును రాత్రికి రాత్రే  ఖాళీ  చేసి అక్కడి నుంచి ఉడాయించారు. గచ్చిబౌలిలోని కార్పొరేట్ ఆఫీస్ కి  వెళ్లి చూస్తే అక్కడ  ఎలాంటి ఆఫీస్ లేకపోవడంతో బాధితులు  మోసపోయామని తెలుసుకున్నారు.  డబ్బులు వసూలు చేసిన ఐటీ కంపెనీ  బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.  ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తో కలిసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు.