స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా శ్రీదేవసేన.. అదనపు బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు

స్కూల్ ఎడ్యుకేషన్  డైరెక్టర్గా శ్రీదేవసేన.. అదనపు బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్​చార్జ్ డైరెక్టర్​గా ఎ. శ్రీదేవసేనను సర్కారు నియమించింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా జీవో నంబర్ 206ని జారీ చేశారు. ప్రస్తుత డైరెక్టర్​నవీన్ నికోలస్ ఈ నెల 13 నుంచి 31 వరకు వ్యక్తిగత సెలవులో ఉన్నారు. దీంతో ఆయన స్థానంలో సీనియర్ ఆఫీసర్ శ్రీదేవసేనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్​ఏసీ) అప్పగించారు. 

శ్రీదేవసేన ప్రస్తుతం కాలేజీయేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ లేదా నవీన్ నికోలస్ తిరిగి వచ్చేంత వరకూ ఆమె  డైరెక్టర్​గా కొనసాగుతారని ఆదేశాల్లో పేర్కొన్నారు.