ఏడు ఐపీఓలకు గ్రీన్సిగ్నల్

ఏడు ఐపీఓలకు గ్రీన్సిగ్నల్

ముంబై:  ఏడు కంపెనీల ఐపీఓలకు సెబీ ఓకే చెప్పింది. యశోదా హెల్త్​కేర్​, ఫ్యూజన్ సీఎక్స్, ఓరియంట్ కేబుల్స్, టర్టిల్ మింట్ ఫిన్ టెక్, ఆర్ఎస్​బీ రిటైల్ (హైదరాబాద్​ కంపెనీ), ఎస్ఎఫ్​సీ ఎన్విరాన్​మెంటల్, లోహియా కార్ప్ ఈ జాబితాలో ఉన్నాయి. 

ఇవి రూ.ఆరు వేల కోట్లకుపైగా  సేకరించవచ్చని అంచనా. యశోద హెల్త్ కేర్ సుమారు రూ. నాలుగు వేల కోట్ల వరకు నిధుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్యూజన్ సీఎక్స్ రూ.వెయ్యి కోట్ల కోసం, ఓరియంట్ కేబుల్స్ రూ.700 కోసం పబ్లిక్​ ఇష్యూకు రానున్నాయి. ఈ కంపెనీలు సేకరించిన నిధులను అప్పుల చెల్లింపులకు, విస్తరణకు వినియోగించనున్నాయి. ఇదిలా ఉంటే,  గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ సంస్థ రూ.251 ఐపీఓను ఈ నెల 22న ప్రారంభించనుంది.  ఒక్కో షేరు ధరను రూ.108–114 మధ్య నిర్ణయించింది.