అడుగడుగునా హెచీసీఏ నిర్లక్ష్యం..ఏడుగురికి తీవ్ర గాయాలు

అడుగడుగునా హెచీసీఏ నిర్లక్ష్యం..ఏడుగురికి తీవ్ర గాయాలు
  • టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ లో తొక్కిసలాట
  •  ఏడుగురికి తీవ్ర గాయాలు.. ఐసీయూలో ఇద్దరు
  • అడుగడుగునా హెచీసీఏ నిర్లక్ష్యం 
  • 18 వేల మందికి ఒక్కటే కౌంటర్
  • గంటల కొద్దీ క్యూ లైన్లలో అభిమానుల పడిగాపులు.
  • టికెట్లు అయిపోయాయన్న ప్రచారంతో ఆందోళన 
  • లాఠీచార్జ్ తో ఉద్రిక్తత... భయంతో పరుగులు

హైదరాబాద్ వెలుగు: ఇండియా - ఆస్ట్రేలియా టీ 20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్లక్ష్యం క్రికెట్ అభిమానుల ప్రాణాలతో చెలగాటం ఆడింది. పోలీసులు లాఠీచార్జ్, తొక్కిన లాటతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు ఐసీయూలో ట్రీట్ మెంట్ పొందుతుంద గా... ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్లో (గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. క్రికెట్ అభి హెచ్సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్ పై పోలీసులు కేసు మానుల్లో భయాందోళనలు సృష్టించింది. ఈ ఘటనతో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌  ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. హెచ్‌‌సీఏ నిర్వహణ లోపంతోనే ఇదంతా జరిగిందని శ్రీనివాస్​గౌడ్​ మండిపడ్డారు. హెచ్‌‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్​పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్ల వ్యవహారంపై శుక్రవారం ప్రెస్​కాన్ఫరెన్స్​లో స్పందిస్తానని అజరుద్దీన్​ అన్నారు. 

టికెట్ల అమ్మకాల్లో గందరగోళం

25న ఉప్పల్‌‌ స్టేడియంలో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య టీ 20 క్రికెట్ మ్యాచ్‌‌ జరగనుంది. టికెట్ల అమ్మకాలపై క్లారిటీ ఇవ్వలేదు. టైమ్ దగ్గర పడుతుం డడంతో ఆఫ్‌‌లైన్​లో టికెట్స్‌‌ విక్రయిస్తామని బుధవా రం రాత్రి ప్రకటించింది. కానీ ఏర్పాట్లు చేయలేదు. పోలీసులకు సరైన సమాచారం ఇవ్వలేదు. జింఖా నా గ్రౌండ్స్​లో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఒక్కొక్కరికి 2టికెట్లే  ఇస్తామని చెప్పింది. దీంతో అభిమానులు బుధవారం సాయంత్రం నుంచే జింఖానా గ్రౌండ్స్​కు చేరుకున్నారు. ఫుట్​పాత్​లపైనే పడుకున్నారు. గ్రౌండ్స్​లోని క్యూలైన్స్ నిండిపోవడంతో ఉద యం 5.30 గంటలకు పోలీసులు గేట్ క్లోజ్ చేశారు.

18 వేల మంది అభిమానులు.. ఒకే కౌంటర్‌‌‌‌ 

టికెట్లు ఇచ్చేందుకు జింఖానా గ్రౌండ్స్​లో హెచ్‌‌సీఏ ఒకే కౌంటర్​ ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంట లకు టికెట్లు ఇస్తామని చెప్పినప్పటికీ మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ వచ్చి ప్రారంభిస్తారని కొద్దిసేపు టికెట్ల ఇవ్వడం ఆపేసినట్లు తెలిసింది. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల తర్వాత టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. కేవలం రూ. 800, రూ. 1,200, రూ. 1,500 టికెట్లు మాత్రమే సేల్ చేశారు. ఆధార్‌‌‌‌ కార్డ్‌‌, ఫోన్‌‌ నంబర్‌‌‌‌, ఓటీపీతో టికెట్లు ఇష్యూ చేశారు. సిగ్నల్స్‌‌, సర్వర్ మొరాయించడంతో మరింత లేట్​ అయ్యింది. 3వేల మంది అభిమానులు లైన్‌‌లో నిలుచున్నారు. మరో 15వేల మందికి పైగా గేట్‌‌ బయట ఉన్నారు. ఇటు ప్యారడైజ్‌‌, అటు టివోలీ నుంచి గ్రౌండ్స్​ వరకు భారీ క్యూ లైన్లలో ఉన్నారు.  

 

టికెట్లు అయిపోయాయన్న ప్రచారంతో..!

కౌంటర్ ప్రారంభించిన కొద్దిసేపటికే టికెట్లు అయిపోయాయని ప్రచారం జరగడంతో పోలీసులతో అభిమానులు వాగ్వాదానికి దిగారు. కొంతమంది గోడలు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్​ చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో తిరుమలగిరికి చెందిన ఆలియా(19), కేపీహెచ్‌‌బీకి చెందిన సుజాత(26), కొంపల్లికి చెందిన సాయికిశోర్‌‌‌‌(25), కవాడిగూడకు చెందిన ఆదిత్యనాగ్‌‌(23)తోపాటు జింఖానా గ్రౌండ్ స్వీపర్‌‌‌‌ రంజిత(48), కానిస్టేబుల్‌‌  శ్రీకాంత్(36) , ఫైర్ మన్‌‌ జె.శ్రీనాథ్ యాదవ్(37) గాయపడ్డారు. వీరిని సికింద్రాబాద్‌‌ యశోద హాస్పిటల్‌‌కి తరలించారు. ఐదుగురు హాస్పిటల్​ నుంచి డిశ్చార్జ్‌‌ కాగా.. ఆలియా, శ్రీనాథ్​ యాదవ్​ ఐసీయూలో ట్రీట్‌‌మెంట్ పొందుతున్నారు.  

టికెట్లన్నీ అమ్ముడైపోయాయి: హెచ్​సీఏ

ఇండియా - ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌‌ టికెట్లన్నీ అమ్ము డయ్యాయని హెచ్‌‌సీఏ ప్రకటించింది. ఆన్‌‌లైన్‌‌లో పాసులు కొనుగోలు చేసిన వాళ్లు శుక్ర, శని, ఆదివారాల్లో  జింఖానా గ్రౌండ్స్​లో ఫిజికల్‌‌ టికెట్లను కలెక్ట్‌‌ (రెడీమ్‌‌)  చేసుకోవాలని తెలిపింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టికెట్లకు సంబంధించిన ఈ–మెయిల్‌‌ కన్ఫర్మేషన్‌‌, ఓ ప్రభుత్వ గుర్తింపు కార్డు, దాని జిరాక్స్‌‌ కాపీతో రావాలని సూచించింది. ఇతరుల టికెట్లను రెడీమ్‌‌ చేసుకోవాలంటే ఇద్దరి ఐడీ ప్రూఫ్స్‌‌, జిరాక్స్‌‌లు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రకటన తర్వాత పేటీఎంలో టికెట్ల బుకింగ్​ ఓపెన్​ అయింది.

టీఆర్​ఎస్ ​ముఖ్యులకు వేలల్లో టికెట్లు!

టీఆర్​ఎస్​కు చెందిన ముఖ్యులకు వేలాది టికెట్లు చేరినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​పేషీ నుంచి 185 టికెట్లు కావాలని హెచ్​సీఏకు ఈ నెల 19న ఇండెంట్​ వెళ్లింది. ఇందులో 50 వీవీఐపీ టికెట్లు, 10 గ్యాలరీ టికెట్లు, 100 నార్మల్​ టికెట్లు, 25 టికెట్లతో కూడిన ఒక వీఐపీ గ్యాలరీ బాక్స్​ కావాలని, వీటికి డబ్బులు ఇస్తామని అందులో ఉంది. అధికార పార్టీ వాళ్లకు టికెట్లు పంచడం వల్లనే తమకు టికెట్లు దొరకడం లేదని జింఖానా గ్రౌండ్​ వద్ద అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని, విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.  

నా బిడ్డను కాపాడండి: ఆలియా తల్లి

తన బిడ్డను కాపాడాలని ఆలియా తల్లి నుజాత్​ బేగం కన్నీళ్లు పెట్టుకు న్నారు. జింఖానా గ్రౌం డ్స్​లో జరిగిన తోపులాటలో గాయపడ్డ ఆలియా ప్రస్తుతం సికింద్రాబాద్​లోని యశోద హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. ‘‘మా కూతురు ఆలియా కోహ్లీ అభిమాని. గురు వారం తెల్లవారుజామున జింఖానా గ్రౌండ్స్‌‌కి వచ్చాం.  గేట్‌‌ బయట తొక్కిసలాటలో గాయపడింది.యశోద హాస్పిటల్‌‌కి తరలించారు. అడ్మిట్‌‌  టైంలో రూ.60 వేలు కట్టాలన్నారు. రూ.17 వేలు కట్టాం.  మళ్లీ రూ.40వేలు కట్టా లంటున్నారు. డబ్బులివ్వకపోతే ట్రీట్‌‌మెంట్‌‌ చేయమన్నారు. పాపని తీసుకెళ్లాలని   అంటున్నా రు. మా కూతురికి తల, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఎవ్వరూ సాయం చేయడం లేదు’’ అని నుజాత్​ బేగం విలపించారు.