అల్లు అర్జున్ తో అంకిత...

అల్లు అర్జున్ తో అంకిత...

సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్లు ఎలా వస్తారో, ఎలా వెళ్లిపోతారో ఊహించలేం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న వాళ్లు... సడెన్ గా సినిమాలకు దూరమై.. కేవలం వ్యక్తిగత జీవితానికే పరిమితమైపోవడం చూస్తూనే ఉంటాం. అలాంటి హీరోయిన్లలో ఒకరైన నటి అంకిత ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది. హీరో అల్లు అర్జున్ తో ఫొటో దిగి, ఆ మూమెంట్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. కాగా దీని వెనక ఉన్న కారణాలు మాత్రం ఆమె వెల్లడించలేదు. కళ్లద్దాలు పెట్టుకొని ఉన్న బన్నీ పక్కనే హ్యాండ్ బ్యాగ్, మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఏదో సంభాషిస్తున్నట్టుగా ఉన్న ఈ ఫొటోను చూస్తుంటే చాలానే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫొటో వెనక ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా... లేదంటే క్యాజువల్ దిగిన ఫొటోనా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే వీరిద్దరూ ఒకే ఫ్రేములో ఉన్న పిక్ ను షేర్ చేసిన అంకిత.. నక్షత్రం ఎక్కడున్నా ప్రకాశిస్తూనే ఉంటుందనే క్యాప్షన్ ను జతచేసింది.

ఇదిలా ఉండగా అంకిత మొదటిసారి ‘ లాహిరి లాహిరి లాహిరిలో ‘ అనే సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంటరైంది.  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అంకిత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత అంకిత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ సింహాద్రి' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో భూమిక మొదటి హీరోయిన్ గా నటించగా అంకిత సెకండ్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత అంకిత ఇక తిరిగి చూసుకోలేదు. వరుసగా విజయేంద్ర వర్మ, స్టేట్ రౌడీ, వినాయకుడు, సీతారాముడు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత వివాహం చేసుకొని సినిమాలకు దూరమైన యాక్ర్టెస్ లిస్ట్ లో అంకిత చేరిపోయారు.