పెద్దగట్టు జాతర సినిమా ప్రారంభం

పెద్దగట్టు జాతర సినిమా ప్రారంభం

ఆర్‌‌‌‌కే రెడ్డి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కుతోన్న  ‘పెద్దగట్టు జాతర’ చిత్రం మంగళవారం ప్రారంభమైంది. విరాన్ష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి విజయ్ కుమార్ సి.హెచ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎ. రామ కృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ కొట్టి  టైటిల్‌‌‌‌ను రివీల్ చేశారు. 

నిర్మాత  శివలెంక కృష్ణ ప్రసాద్ స్క్రిప్ట్ అందించగా, దేవి శ్రీ గురూజీ కెమెరా స్విచాన్ చేశారు.  ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని మూవీ టీమ్‌‌‌‌కు  శుభాకాంక్షలు తెలిపారు.  దేవి ప్రసాద్, మీనా కుమారి, సత్యకృష్ణ, సురేఖా వాణి, ప్రభాకర్, ధన్‌‌‌‌రాజ్, తాగుబోతు రమేష్, అజయ్ ఘోష్ ఈ చిత్రంలో  కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  నాగార్జున డీఓపీగా, గిరీష్ దేవాంగ్ ఆర్ట్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేస్తున్నారు.