గ్లామర్ రోల్స్‌తో ఆకట్టుకునే కయాదు లోహర్.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ చిత్రంతో ఆడియన్స్ ముందుకొస్తోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న పాన్ ఇండియావైడ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా కయాదు లోహర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో సుబ్బలక్ష్మి అలియాస్ సుబ్బు పాత్రలో నటించా.
నా పాత్రలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది చాలా భిన్నంగా ఉంటుంది. కథలో సుబ్బు పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటూనే, మంచి పెర్ఫార్మెన్స్ స్కోప్ కూడా ఉంది. ఈ సినిమా యాక్షన్, మ్యూజిక్‌తో ఫుల్ కమర్షియల్ ప్యాకేజ్‌గా ఉంటుంది. థియేటర్‌లో ప్రేక్షకులకు మంచి అడ్రినలిన్ రష్ ఇస్తుంది.
నానితో కలిసి పనిచేయడం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఆయన చాలా స్వీట్ అండ్ హంబుల్ పర్సన్. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నానితోపాటు మోహన్‌బాబు గారు, రాఘవ్, సంపూర్ణేష్‌బాబు పాత్రలు కూడా చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ అన్నీ థియేటర్‌లో బ్లాస్ట్ అవుతాయి. శ్రీకాంత్ ఓదెలకు గొప్ప విజన్ ఉంది. తనకు ఏం కావాలో చాలా క్లారిటీ ఉంటుంది. సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.
