న్యూఢిల్లీ: డేటా లేకుండా వాయిస్, మెసేజ్లను మాత్రమే అందించే మరిన్ని బడ్జెట్ రీచార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తేవాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. తక్కువ వాలిడిటీ గల ప్లాన్లు పరిమిత సంఖ్యలో ఉండటంతో అల్పాదాయ వర్గాల వాళ్లు ఇబ్బందిపడుతున్నారని పేర్కొంది. ఇక నుంచి ఆపరేటర్లు 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వాలిడిటీతో వాయిస్ ప్లాన్లను అందించాలి. ప్రతి నెల కచ్చితంగా అదే తేదీన రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలి. ట్రాయ్ఆదేశాల ఫలితంగా బీఎస్‌ఈలో ఎయిర్‌టెల్ షేరు మంగళవారం నష్టపోయింది.
