అయ్యోపాపం..! డివైడర్ ను ఢీకొని స్టూడెంట్ మృతి

అయ్యోపాపం..! డివైడర్ ను ఢీకొని స్టూడెంట్ మృతి

గండిపేట, వెలుగు: ప్రమాదవశాత్తు డివైడర్​ను ఢీకొట్టి ఓ స్టూడెంట్​ మృతిచెందాడు. దూద్ బౌలికి చెందిన మహ్మద్ రయానుదుద్దీన్(21) బీఫార్మసీ పూర్తి చేసి గ్రూప్స్​కు ప్రిపేర్ అవుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి బండ్లగూడలో ఉంటున్న తన మిత్రుల వద్దకు కంబైన్డ్ స్టడీ చేసేందుకు బైక్‌‌‌‌పై బయల్దేరాడు. ఈ క్రమంలో శివరాంపల్లి వద్ద మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్‌‌‌‌పై బైక్​ అదుపుతప్పి డివైడర్‌‌‌‌ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేటు హాస్పిటల్​కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.