న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్ సంక్షోభంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా, ఇండియాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా పెరగదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో తెలిపారు. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించిన 2–6శాతం రేంజ్‌లో రెండు శాతానికి దగ్గరలో ఉందని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.75 శాతంగా నమోదైంది.
ఇరాన్– అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో భారత క్రూడ్ ఆయిల్ బాస్కెట్ ధర బ్యారెల్‌కు 69.01 డాలర్ల నుంచి 119 డాలర్లకి పెరిగింది. అయినప్పటికీ, దీని ప్రభావం ధరల పెరుగుదలపై పరిమితంగానే ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆర్‌బీఐ రిపోర్ట్ ప్రకారం, క్రూడ్ ధరలు 10శాతం పెరిగితే ద్రవ్యోల్బణం సుమారు 30 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది.
