న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్, పహాడీ గుడ్‌నెస్ నుంచి బ్యూటీ అండ్ వెల్‌నెస్ బ్రాండ్ పహాడీ లోకల్‌ను కొనుగోలు చేసింది. డీల్ వివరాలను ప్రకటించలేదు. ఇది హిమాలయ ప్రాంతాలైన లడాఖ్, హిమాచల్ ప్రదేశ్‌ల నుంచి సేకరించిన పదార్థాలతో స్కిన్‌కేర్, వెల్‌నెస్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ కొనుగోలుతో రిలయన్స్ రిటైల్ బ్యూటీ పోర్ట్‌ఫోలియో మరింతగా విస్తరించింది. ఈ సంస్థ ప్రస్తుతం దేశం మొత్తం మీద 20 వేల స్టోర్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహిస్తోంది.
