హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీపీఎం హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. వెంకటేశ్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న 35 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లవుతున్నా సిటీలో ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. శివార్లకు తరలించిన పరిశ్రమల స్థలాలను పేదల ఇండ్ల నిర్మాణానికి ఉపయోగించాలన్నారు.
ధర్నాకు భోజగుట్ట బస్తీ, బతుకమ్మ కుంట బస్తీ, భరత్ నగర్ హాట్స్ బస్తీల నుంచి గుడిసె వాసులు భారీగా తరలివచ్చారు. తర్వాత డీఆర్ వెంకటాచారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ధర్నాలో అంబర్‌పేట కన్వీనర్ ఎం.మహేందర్, లీడర్లు సి. మల్లేష్ , ఆర్.వెంకటేశ్, జి. నరేశ్, ఎం. అజయ్ బాబు, జి. కిరణ్, టి. శేషగిరిరావు, ఆర్. మల్లేష్, ఎం.సత్యనారాయణ, షబానా పాల్గొన్నారు.
