ఏబీవీపీ స్టూడెంట్ మేనిఫెస్టో విడుదల

ఏబీవీపీ స్టూడెంట్ మేనిఫెస్టో విడుదల

సికింద్రాబాద్, వెలుగు: స్టూడెంట్ మేనిఫెస్టోను రాజకీయ పార్టీలన్ని విధిగా తమ మేనిఫెస్టోలో  పొందుపరచాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ స్పష్టం చేశారు. లేకుంటే ఎన్నికల్లో  విద్యార్థులందరూ రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. గురువారం ఓయూ ఆర్ట్స్​కాలేజీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్టూడెంట్ మేనిఫెస్టో విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేసి.. 8,624 స్కూళ్లను పునర్ ప్రారంభించాలని స్టూడెంట్ మేనిఫెస్టో  వెల్లడించింది.

యూనివర్సిటీలన్నింటిలోనూ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేసి టీచింగ్, నాన్​టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరింది. విద్యా హక్కు చట్టాన్ని, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేసింది. జాతీయ విద్యా విధానం 2020ను అమలుపరిచి విశ్వవిద్యాలయాల్లో ఉపాధికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలని తెలిపింది. టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేసి ఖాళీగా ఉన్న ఒక లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేసింది.