కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం


కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.   216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 171 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(54), నితీష్‌ రాణా(30) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో కుల్ధీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు,  ఖాలీల్‌ ఆహ్మద్‌ మూడు, శార్ధూల్‌ ఠాకూర్‌ రెండు, లలిత్‌ యాదవ్‌ ఒక వికెట్‌ సాధించారు. కాగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల స్కోర్‌ సాధించింది.  ఢిల్లీ బ్యాటర్లలో వార్నర్‌(61), పృథ్వీ షా(51) అర్ధ సెంచరీలతో రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో నరైన్‌ రెండు వికెట్లు, రస్సెల్‌, వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌ యాదవ్‌ చెరో వికెట్‌ సాధించారు.