సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్రావుకు కన్నీటి వీడ్కోలు

సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్రావుకు కన్నీటి వీడ్కోలు

జూబ్లీహిల్స్ , వెలుగు: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ వార్తల ఎడిటర్గా ప్రసిద్ధి చెందిన సీనియర్ జర్నలిస్ట్ టి లక్ష్మణ్ రావు అంత్యక్రియలు బుధవారం ఫిలింనగర్​లోని మహాప్రస్థానంలో ముగిశాయి. మంగళవారం ఆయన తన స్వగృహంలోని గోపనపల్లి జర్నలిస్ట్ కాలనీలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. చివరి చూపుగా వందలాది మంది జర్నలిస్టులు లక్ష్మణ్ రావుకు వీడ్కోలు పలికారు. 

అంత్యక్రియల్లో ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాస్, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ మాజీ ఎడిటర్ కట్ట శేఖర్ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.