
మనం పిల్లల మీద ఎంత ఒత్తిడి పెడుతున్నామో ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ సినిమాలో ఆర్ నారాయణ మూర్తి చూపించారని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఆర్ నారాయణ మూర్తి గారి తాలూకు శైలి ప్రత్యేకం. ఆయన సినిమాలు మనకి ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి.
ఈ సినిమా నేను చూశా. విద్యా వ్యవస్థలోని లోపాలను చూపిస్తూ అందర్నీ ఆలోచింపజేసేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు. నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘విద్యను ప్రైవేట్ మాఫియా నుంచి విముక్తి చేసి విద్యను జాతీయం చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. అని చాటి చెప్పేదే ఈ చిత్రం’ అని చెప్పారు.