2026లో డేంజర్ జోన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ఈ ఐదు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు హాంఫట్ !

2026లో డేంజర్ జోన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ఈ ఐదు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు హాంఫట్ !

సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గుండెల్లో గుబులు మరింత పెరిగే లెక్కలు బయటికొచ్చేశాయి. 2026లో.. 164 టెక్ కంపెనీలు ఐదు నెలల వ్యవధిలోనే లక్షా 16 వేల 739 ఉద్యోగులను.. లేఆఫ్స్లో భాగంగా జాబ్స్ నుంచి తొలగించినట్లు లేఆఫ్స్ వివరాలు వెల్లడించే.. Layoffs.fyi వెబ్సైట్ పేర్కొంది.

ఏఏ కంపెనీలు ఎంత మంది ఉద్యోగులను ఈ ఐదు నెలల్లో ఉద్యోగాల నుంచి తొలగించాయో లెక్కలతో సహా వివరించింది. అత్యధికంగా.. మెటా 8 వేల మంది ఉద్యోగులను తొలగించింది. పేపాల్ 4వేల 760, సిస్కో 4 వేలు.. ఇలా కొన్ని ప్రముఖ కంపెనీలు వేలల్లో.. ఇంకొన్ని కంపెనీలు వందల్లో ఉద్యోగులను తొలగించేశాయి.

ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న సైలెంట్ లేఆఫ్స్కు ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. మనుషులు చేయాల్సిన పనులు మొత్తం ఏఐ టూల్స్ చేస్తున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రొడక్షన్ ​కాస్ట్ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగులను తొలగిస్తే జీతాల భారం తగ్గుతుందని భావిస్తున్నాయి.

►ALSO READ | AI దెబ్బకు మధ్యతరగతి జీవితాలు తలకిందులు.. ప్రమాదంలో మహిళలు!

ఈ క్రమంలో బెంచ్పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో ఏఐ కారణంగానే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, రానున్న రోజుల్లో ఏఐ వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే లేటెస్ట్  టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని, స్కిల్స్ పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్, మెషీన్ ​లర్నింగ్, డేటా అనలిటిక్స్ ​వంటి కోర్సులు నేర్చుకున్నోళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే చాన్స్​ ఉందని చెప్పారు.