- రంగారెడ్డిలో 85, వికారాబాద్ లో 78 శాతం పోలింగ్
- రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతం
- సొంతూళ్లలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 85.3 శాతం పోలింగ్ నమోదైంది. సెకండ్‌ఫేజ్‌లో 7 మండలాల్లోని (శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవేళ్ల, షాబాద్, ఆమన్‌గల్, కడ్తాల్, తలకొండపల్లి) 178 గ్రామ పంచాయతీలు, 1540 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అందులో 13 గ్రామ పంచాయతీలు, 232 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 165 గ్రామ పంచాయతీల్లో 499 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,306 వార్డుల్లో 3508 మంది పోటీపడ్డారు. మొత్తం 2,27,883 ఓటర్లలో 1,94,375 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ సి. నారాయణ రెడ్డి కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, ముడిమ్యాల, పొత్‌గల్, షాబాద్, సర్దార్ నగర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మధ్యాహ్నం 1 గంట లోపు క్యూలో ఉన్నవారందరికీ ఓటు అవకాశం కల్పించాలని సిబ్బందికి సూచించారు. చేవెళ్ల మండలం గొల్లపల్లిలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కౌకుంట్ల గ్రామంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో 78.31 శాతం పోలింగ్ నమోదైంది. వికారాబాద్, మోమిన్‌పేట, మర్పల్లి, బంట్వారం, ధారూర్, కోట్‌పల్లి, నవాబుపేటలోని 175 గ్రామ పంచాయతీలు, 1,520 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, అందులో 16 జీపీలు, 122 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 159 పంచాయతీలు, 1,398 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 2,09,847 మంది ఓటర్లలో 1,64,330 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్పల్లి 5వ వార్డులో ఓటు వేశారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఏక్ మామిడి, మూలమడ, నారాయణపూర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
రంగారెడ్డి జిల్లా ఫలితాలు
గ్రామాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అదర్స్
178 74 65 15 24
వికారాబాద్ జిల్లా
గ్రామాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అదర్స్
175 89 36 4 46
మండలాల వారీగా పోలింగ్ శాతం రంగారెడ్డి జిల్లా
- ఆమన్‌గల్ 90.21%
- తలకొండపల్లి 88.37%
- కడ్తాల్ 86.73%
- శంకర్‌పల్లి 85.97%
- మొయినాబాద్ 84.11%
- చేవేళ్ల 83.11%
- షాబాద్ 82.22%
వికారాబాద్ జిల్లా
- ధారూర్ 82.39%
- నవాబుపేట 81.52%
- మర్పల్లి 78.71%
- బంట్వారం 78.19%
- కోట్‌పల్లి 76.43%
- వికారాబాద్ 74.74%
- మోమిన్‌పేట 74.02%
