ఇబ్రహీంపట్నం, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదంటూ ఓ వ్యక్తిపై వార్డు మెంబర్ అభ్యర్థి దాడికి పాల్పడ్డాడు. యాచారం సీఐ నంధీశ్వర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. చౌదర్ పల్లి గ్రామానికి చెందిన బొద్రమోని రవీందర్ పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు సభ్యుడిగా పోటీచేసి 7 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
బొద్రమోని మల్లేశ్ కుటుంబ సభ్యులు తనకు ఓటు వెయ్యకపోవడం వల్లే ఓడిపోయినట్లు భావించాడు. దీంతో శుక్రవారం మల్లేశ్‌పై ఆయన దాడికి పాల్పడి చంపుతామని బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదుతో యాచారం పోలీసులు కేసు నమోదు చేశారు.
