హాంగ్‌కాంగ్‌తో మ్యాచ్.. కోహ్లీ, సూర్య హాఫ్ సెంచరీలు

హాంగ్‌కాంగ్‌తో మ్యాచ్.. కోహ్లీ, సూర్య హాఫ్ సెంచరీలు

ఆసియా కప్‌ 2022లో భాగంగా ఇవాళ  హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో.. టీమిండియా రఫ్పాడించింది.  టాస్‌ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన రోహిత్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసింది.  అయితే దుబాయ్ స్టేడియంలో ఈ స్కోర్ చాలా బిగ్ స్కోర్.  అయితే ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఓ అనూహ్య మార్పు చేసిం‍ది. ఎవరూ ఊహించని విధంగా కీలక ప్లేయర్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాకు రెస్ట్‌ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత కీలక మ్యాచ్‌లు ఉన్న దృష్ట్యా హార్ధిక్‌కు విశ్రాంతినిస్తున్నట్లు జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ సమయంలో వెల్లడించాడు. హార్ధిక్‌ స్థానంలో ఈ మ్యాచ్‌కు రిషబ్‌ పంత్‌కు అవకాశం కల్పించాడు.  ఈ ఒక్క మార్పు మినహాయించి పాక్‌పై గెలుపొందిన జట్టుతోనే టీమిండియా యధాతథంగా బరిలోకి దిగింది. అయితే భారత్ 200 పరుగులు చేసేలా కనిపించినా .. హాంగ్‌కాంగ్‌ కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తో రాణించింది. దీంతో ఒక్కో ఓవర్ లో కనీసం సింగిల్స్ కూడా తీయలేక పోయారు. చివర్లో మాత్రం ఒక్క బాల్ కూడా వదలకుండా దంచికొట్టారు. దీంతో హాంగ్‌కాంగ్‌ ముందు బిగ్ టార్గెట్ ఉంచారు టీమిండియా ప్లేయర్లు. విరాట్ కోహ్లీ (59), సూర్యకుమార్ యాదవ్(68) హాఫ్ సెంచరీలతో రాణించాడు.

టీమిండియా ప్లేయర్లలో రోహిత్ శర్మ(21) కేఎల్ రాహుల్(36), కోహ్లీ(59), సూర్య కుమార్ యాదవ్(68) రన్స్ చేశారు. 
హాంగ్ కాంగ్ బౌలర్లలో శుక్ల, మహమ్మద్ చెరో వికెట్ తీశారు.