మెక్సికోతో మ్యాచ్‌కా.. లేక మరో పనికా?.. ఇంగ్లాండ్ ప్లేయర్లు వయాగ్రా వాడేందుకు పర్మిషన్!

మెక్సికోతో మ్యాచ్‌కా.. లేక మరో పనికా?.. ఇంగ్లాండ్ ప్లేయర్లు వయాగ్రా వాడేందుకు పర్మిషన్!

England Players Use Viagra: ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 నాకౌట్ మ్యాచ్‌లో సహ-ఆతిథ్య దేశమైన మెక్సికోతో తలపడటానికి ముందు ఇంగ్లాండ్ జట్టు చేసిన సన్నాహాలు ఒక ఊహించని మలుపు తిరిగాయి. మెక్సికో సిటీలో ఎదురయ్యే కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి ఇంగ్లాండ్ మేనేజర్ థామస్ టుచెల్ తమ ప్లేయర్స్ కి మ్యాచ్‌కు ముందు వయాగ్రా (Viagra) టాబ్లెట్లను వాడే ఆప్షన్‌ను ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వార్త ఫుట్‌బాల్ ప్రపంచంలో అందరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ.. దీని వెనుక అసలు కారణం వేరే ఉంది. సాధారణంగా ఉపయోగించే కారణం కోసం కాకుండా, కేవలం మెక్సికోలోని హై-ఆల్టిట్యూడ్ (సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండే ప్రాంతం) వాతావరణాన్ని తట్టుకోవడానికి వైద్యపరమైన ఆప్షన్‌గా దీనిని పరిశీలిస్తున్నారు.

ఎస్టాడియో అజ్టెకా స్టేడియం: 
ఇరు జట్ల మధ్య జరగబోయే ఈ కీలక నాకౌట్ మ్యాచ్ మెక్సికోలోని ఐకానిక్ ఎస్టాడియో అజ్టెకా (Estadio Azteca) స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియం సముద్ర మట్టానికి దాదాపు 7,350 అడుగుల (2,240 మీటర్లు) ఎత్తులో ఉంటుంది. ఇంతటి ఎత్తులో గాలి చాలా పల్చగా ఉండి, ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆటగాళ్లు మైదానంలో 90 నిమిషాల పాటు పూర్తి శారీరక సామర్థ్యంతో (Peak Performance) ఆడటం, శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. కాగా వైద్య శాస్త్రం ప్రకారం.. వయాగ్రా శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది ఊపిరితిత్తులలోని రక్తనాళాలను వెడల్పు చేయడం ద్వారా తక్కువ ఆక్సిజన్ ఉన్న వాతావరణంలో కూడా ప్లేయర్స్ త్వరగా అలసిపోకుండా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా సహాయపడుతుందని భావిస్తున్నారు.

ఇది డోపింగ్ కిందకు రాదా?: 
వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (WADA) నిషేధించిన ఉత్ప్రేరకాల (Prohibited Substances) జాబితాలో వయాగ్రా లేదు.. కాబట్టి క్రీడాకారులు దీనిని పోటీలకు ముందు లేదా తర్వాత ఉపయోగించడానికి చట్టబద్ధంగా అనుమతి ఉంది. కానీ, మెక్సికో సిటీ లాంటి ఎత్తైన ప్రాంతాలలో ఇది ఆటగాళ్ల ప్రదర్శనను ఎంతవరకు మెరుగుపరుస్తుందనే దానిపై వైద్య నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఎవరైనా దీనిని నిజంగానే వాడతారా లేదా అనేది ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ ఇంగ్లాండ్ మెడికల్ టీమ్ ముందున్న కొన్ని ఆప్షన్లలో ఇది కూడా ఒకటి. 

ALSO READ : ముంబైలో జోరుగా వాన.. వర్షంలో తడుస్తూ క్రికెట్ ఆడిన పిల్లలు.. నెట్టింట వీడియో వైరల్!

మెక్సికోకు అడ్వాంటేజ్: 
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు వాతావరణ పరంగా పెద్ద సవాల్ ఎదురుకానుంది. ఎందుకంటే ఆ వాతావరణానికి అలవాటు పడటానికి (Acclimatisation) ఇంగ్లాండ్ జట్టుకు చాలా తక్కువ సమయం దొరికింది. ఇప్పటి వరకు కాన్సాస్ సిటీలో శిక్షణ తీసుకున్న ఇంగ్లాండ్ జట్టు, మ్యాచ్ జరగడానికి కొద్దిసేపటి ముందే మెక్సికో చేరుకోనుంది. మరోవైపు, మెక్సికో జట్టుకు అజ్టెకా స్టేడియంలో ఆడటం చాలా అలవాటు, పైగా ఆ మైదానంలో వారికి తిరుగులేని రికార్డు ఉంది. ఇది వారికి ప్రకృతి పరంగా లభించిన బిగ్ అడ్వాంటేజ్.