చిల్డ్రన్స్ పార్క్లో సందడి చేసిన ఏనుగు

చిల్డ్రన్స్ పార్క్లో సందడి చేసిన ఏనుగు

అస్సాం గౌహతిలోని నారంగి ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న చిల్డ్రన్స్ పార్క్లో ఏనుగు ప్రత్యక్షమైంది. ఏనుగును చూసి స్థానికులు అవాక్కవ్వగా.. అది మాత్రం చిన్నపిల్లల్లాగే ఎంజాయ్ చేసింది. పార్క్లో కట్టిన రబ్బర్ టైర్లతో ఆడుతూ సందడి చేసింది. తొండంతో తోస్తూ, కాళ్లతో తన్నుతూ అటూ ఇటూ పరిగెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

అయితే ఏనుగులు అడవి వదిలి ఇలా బయట తిరగడం సర్వసాధారణమేనట. గత నెలలో ఓ ఏనుగు మిలటరీ క్యాంపులోకి ఫుట్‌బాల్ గేమ్ కు అంతరాయం కల్గించింది. ఒక ప్లేయర్ ఏనుగుకు బాల్ వేయగా..అది బాల్ ను తన కాళ్లతో తన్ని..అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పట్లో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.