ఐదేళ్ల కన్న బిడ్డను అలా ఎలా చంపేశావమ్మా.. బెంగళూరులో దారుణ ఘటన

ఐదేళ్ల కన్న బిడ్డను అలా ఎలా చంపేశావమ్మా.. బెంగళూరులో దారుణ ఘటన

బెంగళూరు: పేగు బంధం పట్ల కూడా ప్రేమ చచ్చిపోతున్న రోజుల్లో మనం బతుకుతున్నామని బెంగళూరులో జరిగిన ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. కామోద్రేకాల వ్యామోహంలో పడి ఐదేళ్ల పాపను ప్రియుడితో కలిసి కన్న తల్లి హత్య చేసిన ఘటన ఇది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నాటకలోని దావణగెరెకు చెందిన ప్రవీణ్.. 2007లో బెంగళూరుకు చెందిన ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులు ఇద్దరూ కొన్నేళ్ల పాటు అన్యోన్యంగానే ఉన్నారు. ఇద్దరు కూతుర్లు కూడా పుట్టారు. ఒక కూతురి వయసు 17 సంవత్సరాలు కాగా, మరో కూతురి వయసు 5 సంవత్సరాలు.

అయితే.. ప్రియాంక జీవితంలోకి తన కాలేజ్ ఫ్రెండ్ అయిన మోహన్ చాన్నాళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో.. ప్రియాంక వైవాహిక జీవితంలో కలతలు మొదలయ్యాయి. ప్రవీణ్కు తెలియకుండా.. మోహన్, ప్రియాంక వివాహేతర సంబంధం కొనసాగించారు. ప్రవీణ్కు విషయం తెలిసిపోవడంతో.. ప్రియాంక ఇక కలిసి ఉండలేనని.. విడాకులు కావాలని తన భర్త ప్రవీణ్పై ఒత్తిడి పెంచింది. అంతటితో ప్రియాంక ఆగలేదు. భర్తను, పెద్ద కూతురిని వదిలేసి చిన్న కూతురిని తీసుకెళ్లి మోహన్తో పాటు కలిసి ఉంటుంది. ఏం జరిగిందో తెలియదు.. మార్చి 24న జరిగిన ప్రియాంక కూతురైన ఐదేళ్ల చిన్నారి చనిపోయింది.

►ALSO READ | Viral Video: E85 పెట్రోల్ ఎందుకు రా బాబు.. మా బండ్లు దొబ్బుతున్నాయ్: తెలుగు కుర్రోడి ఆవేదన

ఏం జరిగిందని.. అడిగితే ప్రియాంక పొంతన లేని సమాధానం చెప్పింది. బిర్యానీ తినిపించానని ఒకసారి, ఐస్ క్రీమ్ తినిపించి ఏసీ కారులో నిద్రపోనిచ్చి వెళ్ళిపోయానని.. తాను ఇంటికి తిరిగి వచ్చిన మరుసటి రోజు ఉదయం పాప చనిపోయి కనిపించిందని ప్రియాంక తన భర్తతో, బంధువులతో చెప్పింది. ప్రియాంక భర్త ప్రవీణ్ పాప మరణంపై తనకు అనుమానాలున్నాయని.. తన భార్యపై, మోహన్పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పాపను పోస్ట్మార్టానికి తరలించారు.

పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ను ప్రవీణ్ విదేశాల్లో పనిచేస్తున్న వైద్యుడైన తన బంధువుకు పంపించాడు. చిన్నారిపై దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారని ఆరోపిస్తూ ప్రవీణ్ తన భార్యపై, ఆమె ప్రియుడిపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మోహన్‌ను అరెస్ట్ చేశారు. ప్రియాంక పరారీలో ఉంది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.