Viral Video: E85 పెట్రోల్ ఎందుకు రా బాబు.. మా బండ్లు దొబ్బుతున్నాయ్: తెలుగు కుర్రోడి ఆవేదన

Viral Video: E85 పెట్రోల్ ఎందుకు రా బాబు.. మా బండ్లు దొబ్బుతున్నాయ్: తెలుగు కుర్రోడి ఆవేదన

E85 Petrol: ఇప్పటికే E20 పెట్రోల్ వాడకంతో వాహనాలు పనిచేయటం లేదని, రిపేర్లు వస్తున్నాయని, రోడ్లపై మధ్యలోనే ఆగిపోతున్నాయని చాలా మంది పాత వాహనాల ఓనర్స్ కంప్లెయింట్ చేస్తున్నారు. వాస్తవంగా కింది స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా మోడీ సర్కార్ జూన్ 6న E85 ఇంధనం లాంచ్ చేయటం సామాన్యులకు కడుపు మండేలా చేస్తోంది. దీంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఒక తెలుగు కుర్రోడు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

వాస్తవానికి తనకు బైక్స్, కార్లు అంటే ఎక్కువ ఇష్టమని, తన వద్ద 3 పెట్రోల్ బైక్స్, 3 డీజిల్ కార్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న తన బైక్స్ E20 పెట్రోల్ వాడుతుంటేనే సపోర్ట్ చేయటం లేదని రిపేర్స్ వచ్చాయని చెప్పాడు. ఈ సమయంలో E85 పెట్రోల్ తీసుకురావటం.. ఇథనాల్ బ్లెండింగ్ రోజురోజుకూ పెంచటంపై ప్రభుత్వానికి కొంచెం అయినా సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రూడ్ వినియోగం తగ్గించాలంటే దేశంలో ఎలక్ట్రిక్ వాహనలను ప్రోత్సహించాలని సూచించాడు. చైనా మాదిరిగా ఈవీల వైపు ప్రజలను మళ్లేలా చేయాలని కోరాడు. 

ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు షుగర్ కేన్ మిల్స్ ఉన్నాయని వాటి నుంచి వచ్చే ఇథనాల్ అమ్ముకుని కోట్లు వెనకేసుకునేందుకే ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా కేంద్రం ఇథనాల్ పెట్రోల్ అంటూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజంగా క్రూడ్ దిగుమతులు తగ్గించాలనే చిత్తసుద్ధి మోడీ ప్రభుత్వానికి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెట్టాలని అన్నాడు. 

ALSO READ : E20 పెట్రోల్‌కు దండం రా బాబు ఆపేయండి.. 

E85 ఇంధనం సపోర్ట్ చేయని వాహనాల కోసం ప్రత్యేకంగా కిట్ తయారు చేయాలని ఆటో కంపెనీలకు కేంద్ర మంత్రి పిలుపునివ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కిట్ కి అయ్యే ఖర్చులు సామాన్యుల నెత్తిన రుద్దటం ఏంటి.. నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం కథా అంటూ ప్రశ్నించాడు. వేలకు వేలు పెట్టి ఈఎంఐలలో కష్టపడి బండి కొనుక్కున్నోళ్లు ఇథనాల్ కలిపిన పెట్రోల్ కారణంగా పనిచేయక అప్పులు చేసి రిపేర్స్ చేయించుకుంటుంటే.. అవన్నీ పట్టించుకోకుండా వారిపై ఇంకా భారం పడేలా కిట్ ఖర్చులు మోపటం సరికాదన్నాడు. 

సరే ఇదంతా పక్కనపెడితే పెట్రోలులో చీప్ ఇథనాల్ మిక్స్ చేసినా రేట్లు మాత్రం తగ్గించకపోవటం ఏంటని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశాడు. లీటరు ఇథనాల్ దాదాపు రూ.45 నుంచి రూ.60 మధ్యనే దొరుకుతోంటే దానిని పెట్రోలులో కలిపితే 40 శాతం వరకూ రేట్లు తగ్గాల్సి ఉంటుందని ప్రశ్నించాడు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి ఇలా ఓపెన్ కరప్షన్ చేస్తే ఎలా అంటూ వాహనదారుల వాస్తవ ఇబ్బందులను కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. జనాన్ని ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నా మళ్లీ దేశంలో దానికే జనం ఓటేయండి అంటూ వ్యంగ్యంగా వీడియోను ముగించాడు. మెుత్తానికి దేశంలో ఒకపక్క ప్రజలు ఆరోగ్యం కోసం చక్కెర వినియోగం తగ్గిస్తుంటే దానిని ఇథనాల్ గా మార్చి మరికొందరు లాభాలు గడిస్తున్నారని సోషల్ మీడియాలో టాక్.