అనుమానాస్పదస్థితిలో మహిళ డెడ్ బాడీ

అనుమానాస్పదస్థితిలో మహిళ డెడ్ బాడీ
  • భర్తే చంపి ఉంటాడని అనుమానం!
  • నిందితుడి కోసం ఉప్పల్ పోలీసుల గాలింపు 

ఉప్పల్, వెలుగు: అనుమానాస్పద స్థితిలో మహిళ డెడ్ బాడీ లభించిన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. ఉప్పల్ న్యూ భరత్ నగర్ లో ఓ ఇంట్లోని గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు100 కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి రూమ్ తెరిచి చూడగా కుళ్లిన స్థితిలో మహిళ డెడ్ బాడీ కనిపించింది. 

ఆరు నెలలుగా అద్దె ఇంట్లో ఒడిశాకు చెందిన ప్రదీప్ బోలా, మధుస్మిత (28) దంపతులు ఉంటున్నారు. వారి మధ్య కొన్ని రోజులుగా గొడవలు అవుతున్నాయని కోపంతో భర్త ప్రదీప్ బోలా భార్యను హత్య చేసి సంచిలో పెట్టి పరారై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం  ప్రత్యేక టీమ్ తో గాలింపు చేపట్టామని సీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.