కుక్కల కోసం ప్రైవేట్​ జట్​... లక్షల్లో ఖర్చు చేశారు

కుక్కల కోసం ప్రైవేట్​ జట్​... లక్షల్లో ఖర్చు చేశారు

లండన్‌లోని ఓ మహిళ తన కుక్కలను లండన్ నుంచి న్యూయార్క్ తీసుకెళ్లేందుకుప్రైవేట్ జెట్‌ను బుక్ చేసుకుంది. సాధారణంగా కారులో ప్రయాణించేటప్పుడు, మార్కెట్‌కి  వెళ్లేటప్పడు పెంపుడు కుక్కలను  తీసుకెళ్తుంటారు.  అయితే తాజాగా ఓ మహిళ తన కుక్కను నడకకు తీసుకెళ్లేందుకు జెట్‌ విమానాన్ని బుక్ చేసి... లక్షల రూపాయలు వెచ్చించారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మాడీ యంగ్  (31) అనే మహిళ  తన రెండు కుక్కలను మైల్-హై కెన్నెల్ క్లబ్‌కు తీసుకెళ్లాలనుకుంది.  ముందుగా  ఎయిర్‌లైన్ టిక్కెట్‌లను చూస్తే ..  వాటి ధర చూసి మ్యాడీకి మతి పోయింది. రెండు కుక్కలను  కార్గోలో తీసుకెళ్లేందుకు 15 వేల డాలర్లు అంటే దాదాపు 12 లక్షల రూపాయలు అవుతాయి. అయితే 3,470 మైళ్ల దూరం ప్రయాణం  చేసేందుకు ప్రైవేట్​ జెట్​కు 10 వేల డాలర్లు ( రూ. 8 లక్షలు) ఖర్చని మ్యాడీ  ఎంక్వయిరీ చేసింది.  దీంతో ఎలాంటి సమస్య లేకుండా ఆమె ఎంతో ఇష్టపడే కుక్కలను తీసుకెళ్లేందుకు ప్రైవేట్​ జట్​ బుక్​  చేసింది.   ఇది చూసి సోషల్ మీడియాలో చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కుక్కలకు కూడా ఒక రోజు ఉందని ఒకరు రాశారు.

ప్లైట్స్​ లో కుక్కలకు నో ఎంట్రీ

వాస్తవానికి, విమాన ప్రయాణం చాలా ఖరీదైనది.   చాలా విమానయాన సంస్థలు ఫ్లాట్ ఫేస్ జాతి కుక్కలను తీసుకెళ్లడానికి ఇష్టపడవు.  ఈ జాతికి చెందిన చాలా కుక్కలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నాయి అంతేకాక  ఎత్తుకు వెళ్లే కొద్ది వాటి ఆరోగ్య  పరిస్థితి  క్షీణిస్తుంది.  కుక్కలను విమానంలో తీసుకెళితే  ప్రయాణీకులకు ఇబ్బందులు పడతారు.కాని  యంగ్  రెండు కుక్కలకు అలాంటి సమస్య లేదు. కొంతమంది క్రూయిజ్‌లో ప్రయాణించాలని సూచించారని, అయితే దీనికి ఎక్కువ సమయం పడుతుందని యంగ్ చెప్పారు.