
- అబార్షన్ చేయించారని పోలీసులకు బాలిక ఫిర్యాదు
- వారితోపాటు తల్లిదండ్రులు, కులపెద్దలపై కేసు
అత్తామామలు అబార్షన్ చేయించి తనను మోసం చేశారని ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. అయితే వారితోపాటు బాలిక తల్లిదండ్రులు, కులపెద్దలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని బాలిక(16)ను తాటిపల్లికి చెందిన నాగులూరి అరవింద్(22) మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. విషయం బయటపడటంతో పెద్దలు పంచాయితీ పెట్టి బాలికను అరవింద్‌కు ఇచ్చి పెండ్లి చేశారు. ఇటీవల అరవింద్, అతని తల్లిదండ్రులు బాలికను హాస్పిటల్‌కు తీసుకువెళ్లి ఆమెకు తెలియకుండా అబార్షన్ చేయించారు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు గొడవ చేశారు. ఈ క్రమంలో బాలిక తన భర్త, అత్తామామలపై కేసు పెట్టింది. అరవింద్ తల్లిదండ్రులు సంగయ్య, లలితతో పాటు మైనర్‌కు పెళ్లి చేసినందుకు బాలిక తల్లిదండ్రులు, పెళ్లికి సహకరించిన గ్రామ పెద్దలు ముగ్గురిని పోలీసులు శుక్రవారం రిమాండ్ కు తరలించారు.