వరల్డ్​వార్​–2 నాటి బాంబు ఇంగ్లాండ్​లో పేలింది

వరల్డ్​వార్​–2 నాటి బాంబు ఇంగ్లాండ్​లో పేలింది

డిఫ్యూజ్​ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలిన బాంబు

లండన్ : రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబు ఒకటి గ్రేట్​ యార్​మౌత్​ ఏరియాలో బయటపడింది. నార్ ఫోక్ టౌన్​లోని రివర్​ క్రాసింగ్​ వద్ద సుమారు 250 కిలోలు ఉన్న బాంబును గుర్తించారు. డిఫ్యూజ్​ చేసేందుకు ప్రయత్నిస్తుండగా బాంబు పేలిపోయిందని అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు. నార్​ ఫోక్ టౌన్​లో రివర్​క్రాసింగ్​ వద్ద మరమ్మత్తులు చేస్తున్న కాంట్రాక్టర్​ మంగళవారం నాడు ఈ బాంబును గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకుని పరిశీలించిన అధికారులు అది రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబు అని తేల్చారు. బాంబు బరువు సుమారు 250 కిలోలు ఉంటుందని, 3.2 అడుగుల పొడవు ఉందని చెప్పారు.

ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఆంక్షలు విధించి, చుట్టుపక్కల ఏరియాలోని జనాలను ఖాళీ చేయించారు. గురువారం బాంబును డిఫ్యూజ్​ చేసే ప్రక్రియ ప్రారంభించారు. బాంబుతో పాటు ఇతర ఆయుధాలను క్లియర్  చేసేందుకు ఆర్మీ స్పెషలిస్టులు స్లో బర్న్ టెక్నిక్​(పేలుడు పదార్థాలను మెల్లగా కాల్చేయడం లేదా నిర్వీర్యం చేయడం) ఉపయోగించారని చెప్పారు. ఈ ప్రక్రియలో అనుకోకుండా బాంబు పేలిపోయిందని అధికారులు చెప్పారు. పేలుడు ధాటికి రివర్​ వాల్​ కొంత డ్యామేజ్​ అయిందని, నష్టాన్ని అంచనా వేస్తున్నామని వివరించారు. బాంబ్ బ్లాస్ట్  అనంతరం 400 మీటర్ల పరిధి వరకు ఆంక్షలు విధించామని నార్ ఫోక్  పోలీసు అధికారులు చెప్పారు. పబ్లిక్  సేఫ్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. బాంబు పేలుడు ఘటనతో పట్టణవాసులు కొంత అసౌకర్యానికి గురయ్యారని, ఆయుధాలను క్లియర్  చేసే పనులు ముగిసిన తర్వాత ఆంక్షలను ఎత్తివేస్తామని వివరణ ఇచ్చారు.