ఎంతపని చేశావయ్యా..! యాక్సిడెంట్చేశాడు.. మనస్థాపంతో ఏంచేశాడంటే..

ఎంతపని చేశావయ్యా..! యాక్సిడెంట్చేశాడు.. మనస్థాపంతో ఏంచేశాడంటే..

ఇబ్రహీంపట్నం, వెలుగు: మద్యం మత్తులో వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ యువకుడు కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిభట్ల సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లికి చెందిన ఎరకుల బాలకృష్ణ(28) మార్చి 8న రాత్రి తుర్కయంజాల్ బావర్చి హోటల్ వద్ద తన థార్ వాహనంతో ఓ బైక్​ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్​పై వెళ్తున్న మనోజ్, మంజునాథ్ తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

బాధితుల బంధువుల ఫిర్యాదుతో పోలీసులు బాలకృష్ణపై కేసు నమోదు చేసి మార్చి 10న నోటీసులు ఇచ్చారు. అయితే, తాను చేసిన తప్పుకు కుంగిపోయిన బాలకృష్ణ మార్చి 11న ‘నేను చనిపోతున్నాను’ అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. భార్య శ్రావణి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం శ్రీశైలం హైవే పక్కన కొట్రా గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకొని బాలకృష్ణ మృతి చెందినట్లు గుర్తించారు.