కారు ఆపిండని హోంగార్డుపై రెచ్చిపోయిన యువతి

కారు ఆపిండని హోంగార్డుపై రెచ్చిపోయిన యువతి

జూబ్లీహిల్స్,వెలుగు:  ఓ యువతి ట్రాఫిక్​ రూల్స్ ఉల్లంఘించడమే కాకుండా డ్యూటీలో ఉన్న ట్రాఫిక్  హోంగార్డును  బూతులు తిడుతూ రెచ్చిపోయిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ ​పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం..  రాత్రి 8.30 ప్రాంతంలో టీఎస్​07 ఈఎమ్​1444 నంబర్ జాగ్వార్​ కారులో ఓ యువతి బంజారాహిల్స్ లోని అగ్రసేన్​ సర్కిల్​ నుంచి  అపోజిట్​లో వెళ్తూ  ఎదురుగా రావడంతో ట్రాఫిక్​ హోంగార్డు విగ్నేశ్ అడ్డుకున్నాడు .

 దీంతో ఆమె కారు దిగి “ నన్నే ఆపుతావా’’ అంటూ ఆవేశంతో ఊగిపోయింది. బూతులు తిడుతూ హల్ చల్ చేసింది. అతని డ్రెస్ చింపడమే కాకుండా ఫోన్ కూడా పగలగొట్టింది. దీంతో హోంగార్డు విగ్నేశ్​​ బంజారాహిల్స్​ పీఎస్ లో ఫిర్యాదు చేయగా యువతిపై 352,504,332 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.