ఆర్ఎస్ ప్రవీణ్కు దొరలవాదం ఎక్కింది : మేడిపల్లి కాంగ్రెస్ నాయకులు

ఆర్ఎస్ ప్రవీణ్కు దొరలవాదం ఎక్కింది : మేడిపల్లి కాంగ్రెస్ నాయకులు

మేడిపల్లి, వెలుగు: బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​పై మేడ్చల్ జిల్లాలోని ఘట్​కేసర్​, మేడిపల్లి కాంగ్రెస్ నాయకులు ఫైర్​అయ్యారు. బహుజనవాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్ కుమార్.. బీఆర్ఎస్​లో చేరిన తర్వాత దొరల వాదాన్ని భుజాన వేసుకున్నారని విమర్శించారు. బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ లీడర్లు తుంగతుర్తి  రవి, కర్రే రాజేశ్, బండి శ్రీరాములు మాట్లాడారు. మేడ్చల్ నియోజకవర్గంలోని బొమ్మరాశిపేటలో ఇటీవల ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై గళమెత్తిన ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు ఆ విషయాలను మరిచిపోయి కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నారన్నారు. ‘ప్రవీణ్​కుమార్​నుంచి బహుజన వాదం దిగి.. దొరల వాదం ఎక్కింది’ అని విమర్శించారు.  

మల్లారెడ్డిపైనా మండిపాటు

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపైనా కాంగ్రెస్ లీడర్లు తీవ్ర విమర్శలు చేశారు. ‘మేడ్చల్ నియోజకవర్గానికి పట్టిన శని మల్లారెడ్డి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత ఆస్తులు, వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజల సమస్యలపై లేదని ఆరోపించారు.తాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు వంటి ప్రజా సమస్యల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో చొరవ చూపలేదని విమర్శించారు. కాంగ్రెస్​ లీడర్లు దర్గా దయాకర్ రెడ్డి, ఎనుగు జలేందర్ రెడ్డి, ముదిగొండ రమేష్, దుర్గా, మణిరాం నాయక్, కర్రె బల్​రాం,  సుక్క జయేందర్ పాల్గొన్నారు.